చాలా మంది పిల్లలు పెరిగి డాక్టర్ కావాలని కలలు కంటారు. డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదవాల్సిందే. భారతదేశంలో MBBS చదవడం చాలా ఖరీదైన వ్యవహారం. ఇది అత్యంత కష్టం కూడా. దీని వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వెళ్లి మెడిసిన్ చదువుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య భారతీయ విద్యార్థులను దేశానికి తిరిగి రావాలని ఒత్తిడి చేస్తున్నాయి.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ఎప్పుడన్నది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఒకవేళ యుద్ధం ముగిసినా.. ఉక్రెయిన్ ఈ యుద్ధం నుంచి ఎఫ్పటికి కోలుకుంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. 'ఆపరేషన్ గంగా' కింద ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది వ్యక్తుల మనసుల్లో.. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో MBBS చదువుతున్న విద్యార్థులు మరియు వారి కుటుంబాలలో భవిష్యత్తు గురించి చాలా అనిశ్చితి ఉంది. తమ పిల్లలు డాక్టర్ కాగలరా ? వారు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లగలరా ? వాళ్లు డాక్టర్ పట్టా పొందగలరా ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే ఉక్రెయిన్ నుండి MBBS చేస్తున్న విద్యార్థులు ఇప్పటికీ భారతదేశానికి తిరిగి వస్తున్నారు. వారికి MBBS పూర్తి చేయడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
1.రష్యా-ఉక్రియన్ యుద్ధం ముగిస్తే, విద్యార్థులు రెండు-మూడు నెలల్లో ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లవచ్చు. అప్పుడు వారు తమ చదువును పూర్తి చేసి డిగ్రీ పొందగలుగుతారు.
2. మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు అదే దేశంలోని మరొక విశ్వవిద్యాలయానికి లేదా మరొక దేశంలోని వైద్య కళాశాలకు బదిలీ చేయవచ్చు. అయినప్పటికీ వారు సంస్థకు బదిలీ చేయాలనుకుంటున్న దేశంలోని వైద్య విద్య మార్గదర్శకాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.
3. భారతదేశంలో MBBS అధ్యయనాలకు NEET పరీక్షను ఇవ్వడం తప్పనిసరి. కానీ NMC లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) ఏదైనా సడలింపు ఇస్తే, ప్రస్తుత పరిస్థితిని మినహాయింపుగా పరిగణించి ఈ విద్యార్థులు భారతదేశంలోని ఏదైనా వైద్య సంస్థకు బదిలీ పొందవచ్చు.
4. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు, అనేక పాశ్చాత్య దేశాల వైద్య విశ్వవిద్యాలయాలలో బదిలీని కనుగొనవచ్చు. అయితే ఉక్రెయిన్‌తో పోలిస్తే ఈ దేశాలలో అధ్యయనాలు ఖచ్చితంగా ఖరీదైనవి. అయితే కోర్సు పూర్తయ్యాక మంచి అవకాశాలు కూడా పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medicine, Russia-Ukraine War