మొదట తెలంగాణలో, తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పాస్ కాగానే ఉద్యోగం కోసం వేట మొదలుపెడతారు కొందరు. ఇంకొందరు చదువు వైపు అడుగులు వేస్తుంటారు. ఏం చదవాలి? ఏ కోర్సు ఎంచుకోవాలి? చదువు కొనసాగించాలా? లేక ఉపాధి వైపు అడుగుపెట్టాలా? అన్న డైలమా కనిపిస్తుంది. టెన్త్ తర్వాత చదువు కొనసాగించడానికి అనేక మార్గాలున్నాయి. వేర్వేరు రంగాల్లో పదుల సంఖ్యలో కోర్సులున్నాయి.
ఆ కోర్సుల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఉన్నత చదువులు కాకుండా వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందాలంటే అనేక అవకాశాలున్నాయి. డిఫెన్స్, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ రంగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి.
Read this:
Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి
పదో తరగతి తర్వాత డిఫెన్స్ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. డిఫెన్స్‌లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ విభాగాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలుంటాయి. ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్లు జారీ అవుతుంటాయి. టెక్నికల్ కేడర్‌లో క్లర్క్, జనరల్ డ్యూటీ, నర్సింగ్ అసిస్టెంట్, టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో నాన్ టెక్నికల్ ట్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఇండియన్ నేవీలో డాక్ యార్డ్ అప్రెంటీస్, సెయిలర్స్ మాట్రిక్ ఎంట్రీ, ఆర్టిఫైసర్ అప్రెంటీస్ పరీక్షలుంటాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలుంటాయి. ఇక రైల్వేలో 10వ తరగతి అర్హతతో గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాలు ఉంటాయి.

ప్రతీకాత్మక చిత్రం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పదో తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను విడుదల చేస్తాయి. బీఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బీ, ఎన్ఐఏ లాంటి ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ఉద్యోగుల్ని నియమిస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వారికి కావాల్సిన శిక్షణను కూడా అందిస్తుంది. టెన్త్ పాసైనవారికి ఎక్కువగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్స్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కాకుండా రెండేళ్ల కోర్సులు చేసి ఉపాధి పొందొచ్చు. డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాల్లో చేరొచ్చు. ఆర్ట్ టీచర్, కమర్షియల్ ఆర్ట్, బ్యూటీ కల్చర్, గార్మెంట్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ల్యాబరేటరీ టెక్నీషియన్ లాంటి విభాగాల్లో డిప్లొమా కోర్సులుంటాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టులు ఉంటాయి. వీటితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు విభాగాల్లో 10వ తరగతి అర్హతతో ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తుంటాయి.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి
ఇవి కూడా చదవండి:
Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... వివరాలివే
PAN Card: పాన్ కార్డు దరఖాస్తులో చేయకూడని 10 తప్పులివే...
LIC Policy: ఏడాదికి రూ.100 ప్రీమియంతో ఎన్నో లాభాలు