Home /News /jobs /

CBSE board exam: నవంబర్‌లో సీబీఎస్​ఈ టర్మ్ 1 పరీక్షలు.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలివే..!

CBSE board exam: నవంబర్‌లో సీబీఎస్​ఈ టర్మ్ 1 పరీక్షలు.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE board exam: ప్రతి టర్మ్​ 50 శాతం సిలబస్ కవర్​ చేస్తుంది. టర్మ్​1 పరీక్షలు నవంబర్​లో, టర్మ్​ 2 పరీక్షలు మార్చి–ఏప్రిల్​ నెలల్లో జరగనున్నాయి. దీంతో సీబీఎస్​ఈ 10వ, 12వ తరగతి విద్యార్థులు వచ్చే నెలలో జరగనున్న టర్మ్ 1 పరీక్షల షెడ్యూల్​ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇంకా చదవండి ...
విద్యా విధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా 2021–22 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్​ఈ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను సెమిస్టర్​ విధానంలో జరపాలని నిర్ణయించింది. అంటే ఈ పరీక్షలకు (Exams) సంవత్సరానికి రెండుసార్లు జరగనున్నాయి. ప్రతి టర్మ్​ 50 శాతం సిలబస్ కవర్​ చేస్తుంది. టర్మ్​1 పరీక్షలు నవంబర్​లో, టర్మ్​ 2 పరీక్షలు మార్చి–ఏప్రిల్​ నెలల్లో జరగనున్నాయి. దీంతో సీబీఎస్​ఈ 10వ, 12వ తరగతి విద్యార్థులు వచ్చే నెలలో జరగనున్న టర్మ్ 1 పరీక్షల షెడ్యూల్​ కోసం ఎదురు చూస్తున్నారు.

సీబీఎస్​ఈ త్వరలోనే ఈ షెడ్యూల్​ను తన అధికారిక వెబ్‌సైట్-www.cbse. gov.in ద్వారా విడుదల చేయనుంది. టర్మ్​ 1 పరీక్ష నవంబర్​ నుంచి 4–8 వారాల వ్యవధిలో జరగనుంది. ఈ టర్మ్ 1 ప్రశ్నాపత్రం బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQ)ల విధానంలో ఉంటుంది. ఇందులో కేస్-బేస్డ్, అసర్షన్ -రీజనింగ్ మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​ కూడా వస్తాయి. ప్రతి సబ్జెక్ట్​ పేపర్​ వ్యవధి మునుపటి 3 గంటల మాదిరిగా కాకుండా కేవలం 90 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మార్కులు ఒకే విధంగా ఉంటాయి. విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆప్షన్లకు కూడా ఇస్తారు.

2022 మార్చిలో జరగబోయే సీబీఎస్​ఈ టర్మ్ 2 బోర్డ్ పరీక్షలో సబ్జెక్టివ్​ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఈ టర్న్​ 2 పరీక్షలోని ప్రతి పేపర్​కు 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఇక, టర్మ్​ 1 ప్రాక్టికల్​ పరీక్షలు ఆయా పాఠశాలలే నిర్వహిస్తాయి. టర్మ్​ 2 ప్రాక్టికల్​ పరీక్షలు కోవిడ్–19 పరిస్థితిని బట్టి సీబీఎస్​ఈ నిర్వహిస్తుంది.

Drinking More Water: నీళ్లు మరీ ఎక్కువగా తాగుతున్నారా ?.. ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం..

Revanth Reddy: హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎదుర్కోబోయే అసలు సిసలు పరీక్ష ఇదే..!

ఓఎంఆర్​ షీట్‌లో అదనపు సర్కిళ్లు..
టర్మ్ 1 బోర్డ్ ఎగ్జామ్ మల్టిపుల్​ ఛాయిస్​ ఓఎంఆర్​ షీట్​ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్​ షీట్లలో ప్రతి ప్రశ్నకు అదనపు సర్కిల్ కూడా పొందుపర్చినట్లు​ బోర్డ్​ పేర్కొంది. ఎందుకంటే విద్యార్థులు ఓఎంఆర్​ షీట్లలో సరైన ఆప్షన్లను గుర్తించడానికి పెన్నులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. పొరపాటున ఏదైనా తప్పు సమాధానం గుర్తిస్తే దాన్ని చెరిపేసే అవకాశం ఉండదు. కనుక ప్రతి ప్రశ్నకు అదనపు సర్కిల్​ను పొందుపర్చింది. ఒకవేళ అభ్యర్థి తప్పు ఆప్షన్​ను ఎంచుకుంటే.. వారు దాన్ని కొట్టివేసి అదనపు సర్కిల్​లో సరైన సమాధానాన్ని రాయవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: CBSE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు