KNOW ABOUT CAREER EDUCATION MUSEOLOGY AND COLLEGES OF MUSEOLOGY EVK
Career Advice: బెస్ట్ కెరీర్ చాయిస్ "మ్యూజియాలజీ".. అంటే ఏమిటో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు సరైన కెరీర్ (Career) ఆప్షన్ ఎంచుకోలేక ఇబ్బంది పడతారు. ఇంటర్(Inter) పూర్తికాగానే నూటికి 80శాతం మంది ఇంజనీరింగ్ లో చేరతారు. కానీ విభిన్న మైన కోర్సులు చాలా ఉంటాయి. అలాంటి ఓ కోర్సే మ్యూజియాలజీ (Museology).
ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు సరైన కెరీర్(Career) ఆప్షన్ ఎంచుకోలేక ఇబ్బంది పడతారు. ఇంటర్ పూర్తికాగానే నూటికి 80శాతం మంది ఇంజనీరింగ్(Engineering)లో చేరతారు. మరి కొందరు కామర్స్ కోర్సుల్లో చేరతారు. కానీ విభిన్న మైన కోర్సులు చాలా ఉంటాయి. అందులో చేరితే మంచి విషయ పరిజ్ఞానంతో పాటు ఆర్థికంగా కెరీర్ అవకాశాలు ఉంటాయి. అలాంటి ఓ కోర్సే మ్యూజియాలజీ (Museology). అసలు మ్యూజియాలజీ అంటే ఏమిటి.. ఆ కోర్సు ఎలా చేస్తారో తెలుసుకొందాం.
మ్యూజియాలజీ అంటే ఏమిటీ..
మ్యూజియాలజీ అంటే సైన్స్ ఆఫ్ మేనేజింగ్, ఆర్గనైజింగ్ ట్రైనింగ్ ఆఫ్ ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ మ్యూసియం. అంటే మ్యూజియం(museum)ను ఎలా నిర్వహించాలి.. ఎలా నడపాలి. మ్యూజియంల వస్తువుల ఏం ఉంచాలి ఎక్కడ ఉంచాలి అనే అంశాలు మ్యూజియాలజీలో ఉంటాయి. ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది కేవలం ఇండియాలోనే 700 మ్యూజియాలు ఉన్నాయి.
వాటి నిర్వహణకు సమర్థులైన విషయ పరిజ్ఞానం ఉన్నవారు అవసరం. భవిష్యత్‌లోనూ మ్యూజియంల నిర్వహణ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అనడంలో సందేహం లేదు. మ్యూజియాలజిస్ట్ ఏం చేస్తారు..
ఒక మ్యూజియాలజిస్ట్ మ్యూజియంలో క్యూరేటర్‌గా విధులు నిర్వర్తిస్తాడు. మ్యూజియంలో ఏ వస్తువు ఎంత ముఖ్యమైందో గుర్తించి వాటి వివరణాత్మక సమాచారాన్ని అందిస్తాడు. ఎటువంటి వస్తువులు మ్యూజియంలో ఉండాలో కూడా మ్యూజియాలజిస్ట్ నిర్ణయిస్తాడు.
కెరీర్ అవకాశాలు..
దేశంలో కేంద్రంతో పాటు, రాష్ట్రం, జిల్లా, ప్రైవేట్ మరియు ట్రస్ట్ రకం మ్యూజియంలు ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పని చేసే అవకాశం ఉంది. నేషనల్ మ్యూజియం, మానిటరీ మ్యూజియం, RBI, ఇండియన్ మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియంలో ఉద్యోగం పొందవచ్చు. భవిష్యత్‌లో మ్యూజియం నిర్వహణ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంటుంది. అందులో సందేహం లేదు. పాత వస్తువులను భద్ర పరచడం గుర్తించడం నిత్యం అవసరం.
దేశంలో మ్యూజియాలజీ కోర్సు అందించే ప్రముఖ కళాశాలలు ఇవే..
నేషనల్ మ్యూజియం ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ (నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ
గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం, ఢిల్లీ
స్కూల్ ఆఫ్ ఆర్కైవల్ స్టడీస్, న్యూఢిల్లీ
మ్యూజియాలజీ మరియు పరిరక్షణ కేంద్రం, జైపూర్
కలకత్తా విశ్వవిద్యాలయం
మీకు చరిత్ర(History), పరిరక్షణ విజ్ఞానం మరియు మ్యూజియం సేకరణలపై మీకు ఆసక్తి ఉంటే మాత్రమే ఈ కోర్సు చేయండి. ఈ కోర్సులో చేరడానికి కనీస విద్యార్హత 12వ తరగతి చదవాలి. ఏ కోర్సులో 12వ తరగతి చదివినా.. మ్యూజియాలజీ కోర్సు చేయవచ్చు. కోర్సులు వివరాలు..
- బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మ్యూజియాలజీ మరియు ఆర్కియాలజీ-
- బీఏ ఇన్ మ్యూజియాలజీ
- బీఏ ఇన్ ఆర్కియాలజీలో
- పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ మరియు పరిరక్షణ
- పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ మరియు ఇండియన్ ఆర్ట్ హిస్టరీ
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.