IT Jobs: ఇండియాలో ఎక్కువ జీతం వచ్చే 5 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలివే

IT Jobs | బెంగళూరులో 25%, పూణెలో 9%, హైదరాబాద్‌లో 8%, చెన్నైలో 7%, ముంబైలో 5% ఐటీ ఉద్యోగులు ఉన్నారు. జాబ్స్ సైట్ ఇండీడ్ అధ్యయనం ప్రకారం అత్యధిక జీతాలు ఉన్న 5 ఐటీ ఉద్యోగాలు ఇవే.

news18-telugu
Updated: August 15, 2019, 12:58 PM IST
IT Jobs: ఇండియాలో ఎక్కువ జీతం వచ్చే 5 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలివే
IT Jobs: ఇండియాలో ఎక్కువ జీతం వచ్చే 5 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలివే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 15, 2019, 12:58 PM IST
భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. గత పదేళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఐటీ సెక్టార్‌లో ఎక్కువ వేతనం ఇస్తున్న ఉద్యోగాలు ఏవో తెలుసుకునేందుకు జాబ్స్ సైట్ ఇండీడ్ ఓ అధ్యయనం జరిపింది. గత ఐదేళ్లలో ఐటీ కంపెనీలు విస్తరిస్తున్న సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న టెక్నాలజీ ఉద్యోగాలు ఏవో తెలుసుకుంది. డెవలప్‌మెంట్, అనలిటిక్స్, డేటా రంగాల్లో మంచి టాలెంట్ ఉన్నవారికి ఎంతైనా చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. 2014 ఫిబ్రవరి నుంచి 2019 ఫిబ్రవరి మధ్య ఐదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో టెక్నాలజీ ఉద్యోగాలు 8% పెరిగాయని, గత ఏడాదిలోనే టెక్నాలజీ జాబ్ పోస్టింగ్స్ 31% పెరిగాయని తేల్చింది. బెంగళూరులో 25%, పూణెలో 9%, హైదరాబాద్‌లో 8%, చెన్నైలో 7%, ముంబైలో 5% ఐటీ ఉద్యోగులు ఉన్నారు. జాబ్స్ సైట్ ఇండీడ్ అధ్యయనం ప్రకారం అత్యధిక జీతాలు ఉన్న 5 ఐటీ ఉద్యోగాలు ఇవే.

1. డేటా వేర్‌హౌజ్ ఆర్కిటెక్ట్: మధ్యస్థ విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.15,00,000 ఉండగా, ఉన్నత విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.25,00,000. కంప్యూటింగ్‌లో రిపోర్టింగ్, అనాలిసిస్ సిస్టమ్‌నే డేటా వేర్‌హౌజ్ అంటారు. బిజినెస్ ఇంటెలిజెన్స్‌లో ఇది కీలకం.

2. సీనియర్ టెక్నికల్ లీడ్: మధ్యస్థ విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.12,00,000 ఉండగా, ఉన్నత విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.25,00,000. ఐటీ డెవలప్‌మెంట్‌లో టెక్నికల్ లీడ్ తప్పనిసరిగా ఉండే ఉద్యోగం. డిజైనింగ్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ రూపొందించడం వీరి పని.

3. అనలిటిక్స్ మేనేజర్: మధ్యస్థ విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.11,50,000 ఉండగా, ఉన్నత విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.24,00,000. అనలిటిక్స్ మేనేజర్‌కు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన పరిజ్ఞానం ఉండాలి. సంక్లిష్టమైన డేటాను అంచనా వేయడం, విశ్లేషించడం వీరి పని.



4. టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్: మధ్యస్థ విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.10,00,000 ఉండగా, ఉన్నత విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.24,00,000. ప్రాజెక్టుల్ని లీడ్ చేయడం, డెడ్‌లైన్‌ లోపు పూర్తి చేయడం టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ విధి.

5. లీడ్ డెవలపర్: మధ్యస్థ విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.10,00,000 ఉండగా, ఉన్నత విభాగాల్లో పనిచేసేవారి వార్షిక వేతనం సుమారు రూ.24,00,000. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులకు లీడ్ డెవలపర్ బాధ్యత వహిస్తారు. యాప్ డెవలప్‌మెంట్ నుంచి ప్రోగ్రామ్ క్రియేషన్ వరకు అన్నీ చూసుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇంటర్, డిప్లొమా పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు

BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

UPSC Jobs: డిఫెన్స్, నావల్ అకాడమీలో 415 ఖాళీలు... ఇంటర్ పాసైతే చాలు
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...