• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • KL DEEMED UNIVERSITY STUDENTS DEVELOP A PROTOTYPE ELECTRIC BIKE WITH WIRELESS CHARGING TECHNOLOGY HERE IS THE FULL DETAILS NK

E-Bike: కేఎల్ యూనివర్శిటీ స్టూడెంట్స్ చేసిన ఈ-బైక్... దీని ప్రత్యేకత తెలుసుకుంటే షాకే...

కేఎల్ యూనివర్శిటీ స్టూడెంట్స్ చేసిన ఈ-బైక్ (image credit - twitter - ANI)

E-Bike: ఎలక్ట్రిక్ బైక్స్‌లో అది ప్రత్యేకమైనది. ఆటోమొబైల్ కంపెనీలకే ఆశ్చర్యం కలిగించే టైపు. దాని ఫీచర్లేంటో, మైలేజ్, ఇతర వివరాలు తెలుసుకుందాం. కేఎల్ యూనివర్శిటీ విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుందాం.

  • Share this:
    E-Bike: మీరు టీవీలో చూసే ఉంటారు... కేఎల్ యూనివర్శిటీ యాడ్. ఆ యనివర్శిటీలోని ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేస్తున్న ఆరుగురు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్... ఈ ఎలక్ట్రిక్ బైకును తయారుచేశారు. గొప్ప విషయమేంటంటే... దీనికి వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది. చూడ్డానికి సైకిల్‌లా ఉంది కాబట్టి దీన్ని సైకిబైక్ లేదా బైస్కిబైక్ అని పిలుచుకోవచ్చు. మొబైళ్లకు వెర్‌లెస్ టెక్నాలజీ కామన్... కానీ ఎలక్ట్రిక్ బైకులకు దీన్ని సెట్ చెయ్యడం అద్భుతమే. ఈ సరికొత్త ప్రోటోటైప్ తయారుచేయడం ద్వారా కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, ఇతర ఫ్యాకల్టీ తమ టెక్నాలజీ స్కిల్‌ను చూపించారు.

    ఈ బైక్ మాగ్జిమం గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అలాగే... ఒకసారి ఛార్జింగ్ చేస్తే... ఇది 100 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. ఐతే... దీన్ని ఛార్జింగ్ చెయ్యడానికి 5 గంటలు పడుతుంది. రోజూ ఛార్జింగ్ పెట్టేసుకుంటే... బెటరే. వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం... సెల్ బ్యాలెన్సింగ్ ఫీచర్ ఉంది. అది సరిగ్గా ఛార్జింగ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీ చాలా తక్కువగా ప్రపంచ దేశాల్లో ఉంది.

    Electric bike, E bike, KL deemed University, KL deemed University students, wireless charging technology, e-bike price, e-bikes in india, e-bike cycle, electric bike in hyderabad, electric bike price, electric bike price hyderabad, electric bike price telangana, electric bike india, ఎలక్ట్రిక్ బైక్, కేఎల్ యూనివర్శిటీ ఈ బైక్,
    కేఎల్ యూనివర్శిటీ స్టూడెంట్స్ చేసిన ఈ-బైక్ (image credit - twitter - ANI)


    దీన్ని తయారుచేసే ముందు... ఇలాంటిదే ఒకటి డూప్లికేట్ ప్రోటోటైప్ తయారుచేశారు. ల్యాబులోని పరికరాలతో చేశారు. కేఎల్ యూనివర్శిటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ బైక్ కోసం వీరు ఆల్రెడీ ఉన్న బైకుకి మార్పులు చేశారు. దాన్ని ఈ-బైక్‌గా మార్చారు. దానికి వైర్‌లెస్ ఛార్జింగ్ సెట్ చేశారు. బైక్ అందంగా కనిపించేందుకు చాలా మార్పులు చేశారు. దీనికి BLDC మోటర్ (Brushless DC electric motor) అమర్చారు. ఫలితంగా కంట్రోలర్ ద్వారా మాడ్యూల్స్‌ని మార్చవచ్చు.

    ఇప్పుడు ఈ ప్రాజెక్టును స్టార్టప్‌గా ప్రారంభించేందుకు యూనివర్శిటీ రూ.1,40 లక్షలు ఆ టీమ్‌కి ఇచ్చింది. "ప్రస్తుతం ఈ బైక్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాకల్టీ అంతా ఆ విద్యార్థులను మెచ్చుకుంటున్నారు. ఇది విద్యార్థులకు, ఇండియాకి దీర్ఘకాలిక అవసరాలకు బాగా పనికొస్తుంది" అని కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీ ప్రెసిడంట్ కోనేరు సత్యనారాయణ తెలిపారు.

    ఇది కూడా చదవండి: Flying Race Car: గాల్లో ఎగిరిన ప్రపంచ మొదటి ఫ్లైయింగ్ రేస్ కారు... ఫొటోలు మీకోసం

    "మాకు ఫస్ట్ ఇయర్ నుంచే ఇలా ప్రోటోటైప్స్ తయారుచేయించడం, పోటీల్లో పాల్గొనేలా చేయడం చేయించారు. కేఎల్ యూనివర్శిటీలోని ల్యాబ్ ప్రాజెక్టులు చాలా బలంగా ఉన్నాయి. ఇవి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తాయి. కావాల్సిన పరికరాలు, యంత్రాలు, పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి" అని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎం సత్యార్థ ప్రవాశిక్ తెలిపారు. ఈ బైక్ తయారీ టీమ్‌లో ఆయన పాల్గొన్నారు.
    Published by:Krishna Kumar N
    First published: