లాభార్జన లేకుండా అందరికీ ఉచితంగా మాథ్స్, సైన్స్ హిస్టరీ, కంప్యూటింగ్ వంటి కోర్సులు అందిస్తున్న ఖాన్ అకాడమీ (Khan Academy) సంస్థ.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. తాజాగా విద్యార్థులు క్లాసులను మరింత ఈజీగా అర్థం చేసుకునేందుకు కొత్త AI ట్యూటర్‌ను పరిచయం చేసింది. Khanmigo అని పిలిచే ఈ AI ట్యూటర్ GPT-4 ఆధారంగా పనిచేస్తుంది.
రీసెంట్‌గా ఓపెన్ ఏఐ (Open AI) మనుషుల మాదిరిగానే చాలా క్రియేటివ్‌గా, మెరుగైన ఆన్సర్లను ఇచ్చే చాట్‌జీపీటీ 4 (GPT4)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీన్నే ఖాన్ అకాడమీ ట్యూటర్ ఉపయోగిస్తుంది. విద్యార్థులు తమ స్టడీస్‌లో ఏవైనా డౌట్స్ ఉంటే దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఇది క్లాస్‌రూమ్ అసిస్టెంట్‌గా కూడా పని చేస్తుంది.
* AI ట్యూటర్ బెనిఫిట్స్
ఖాన్ అకాడమీ అన్ని వయసుల విద్యార్థులకు గణితం, సైన్స్, హ్యుమానిటీస్ వంటి వివిధ సబ్జెక్ట్స్‌లో ఉచితంగా పాఠాలను అందిస్తుంది. అయితే, ప్రతి విద్యార్థికి ఈ సబ్జెక్టులలోని టాపిక్స్‌కి సంబంధించి ప్రత్యేకమైన ప్రశ్నలు రావచ్చు. వారి ప్రశ్నలు, డౌట్స్‌ను పూర్తిస్థాయిలో తీర్చే వీడియోలు ఖాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు విద్యార్థులు ఫలానా టాపిక్ సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ సమస్యలతో ఏ విద్యార్థి వెనుకపడకుండా వారి ప్రశ్నలకు సమర్ధవంతమైన సమాధానాలు ఇచ్చేలా ఖాన్ అకాడమీ AI-బేస్డ్ వర్చువల్ ట్యూటర్ ఖాన్మిగో (Khanmigo) ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ట్యూటర్ విద్యార్థులు సబ్జెక్టుకు సంబంధించి అడిగే ఏ ప్రశ్నకైనా బెస్ట్ ఆన్సర్ అందిస్తుంది. దీనివల్ల విద్యార్థులు డౌట్స్ తీర్చుకోవడానికి ఎక్కువసేపు వీడియోలు వెతకాల్సిన అవసరం ఉండదు. జస్ట్ సెకన్లలోనే వారి డౌట్స్ తీరుతాయి.
ఖాన్ అకాడమీ AI ట్యూటర్‌తో విద్యార్థులు మెరుగ్గా టాపిక్స్ నేర్చుకోవచ్చు. ఉపాధ్యాయులు తమ సమయాన్ని చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఉపాధ్యాయులకు AI-గైడెడ్ పాఠాలకు యాక్సెస్ కూడా ఉంటుంది. అలానే వారు విద్యార్థుల ప్రోగ్రెస్‌పై ఫీడ్‌బ్యాక్ కూడా పొందవచ్చు. Khanmigo అందించే ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్, రియల్-టైమ్ ఫీడ్‌బ్యాక్‌తో విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ మెరుగుపరచుకోవచ్చు.
Khanmigo విద్యార్థులకు కొత్త మార్గాల్లో రాసేలా, చర్చించేలా, సహకరించేలా ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాదు ఆ మార్గాలలో తగిన సూచనలను అందిస్తుంది. అవసరమైనప్పుడు త్వరగా ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ రూపొందించడానికి ఉపాధ్యాయులు GPT-4ని ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి : మార్చి 20 నుంచి ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్స్.. ఎవరు అర్హులు?
GPT-4 మనుషులతో సమానంగా పని చేయగలదు. ఇది అపారమైన జ్ఞానం, అధునాతన సామర్థ్యాలతో మెరుగైన, కచ్చితత్వంతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలదు. ఖాన్ అకాడమీ రాబోయే కొన్ని సంవత్సరాలలో తమ ప్లాట్‌ఫామ్‌లో మరికొన్ని ట్యూటర్ లాంటి ఫీచర్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇక్కడ నేర్చుకునే విద్యార్థులు సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో పట్టు సాధించగలుగుతారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ త్వరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. అయితే ఇవి నిజమైన టీచర్లను భర్తీ చేయలేవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Chatgpt, EDUCATION, JOBS, Tech news