సరైన ప్లానింగ్(Planning), రీసెర్చ్(Research)తో యూఎస్‌లో డిగ్రీ(US Degree) ప్రయాణం ఒక చక్కటి అనుభవాన్ని ఇస్తుంది. యూఎస్ యూనివర్సిటీకి (University) దరఖాస్తు(Application) చేయడం, నిధులు సేకరించడం, వీసా ప్రక్రియ, ఇంటికి దూరంగా కొత్త జీవితంలో స్థిరపడటం చాలా మందికి కష్టమైన ప్రక్రియ. కానీ సరైన ప్లానింగ్, రీసెర్చ్‌తో(Research) ఇది ఒక ఉత్తేజకరమైన ప్రయాణంగా మారుతుంది. పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌లు(Networks), కమ్యూనిటీ సపోర్ట్(Community Support) వంటివి యూఎస్ వర్సిటీ అనుభవాన్ని ఎక్కువగా పొందడంలో విద్యార్థులకు సహాయపడతాయి. అరిజోనా స్టేట్ నుంచి పవర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్‌లో స్పెషలైజేషన్‌తో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందిన ఆదిత్య శ్రీనివాసన్ మాట్లాడుతూ..‘నేను చేయాలనుకొంటున్న స్పెషలైజేషన్‌ను అందించే వర్సిటీలను చూడటమే మొదటి అంశం. యూనివర్సిటీ టెంపే క్యాంపస్‌లో నేను ప్రస్తుతం ప్రొఫెసర్లు పనిచేస్తున్న పరిశోధనా ప్రాంతాలను, పవర్, ఎనర్జీ డొమైన్ కోసం అందిస్తున్న కోర్సులను చూశాను.
పూర్వ విద్యార్థులు వారి గ్రాడ్యుయేషన్ తర్వాత ఎలా పనిచేశారో కూడా నేను చూశాను’ అని చెప్పాడు. ఖర్చుల పరంగా ప్రైవేట్ వర్సిటీల కంటే ప్రభుత్వ వర్సిటీలను షార్ట్‌లిస్ట్ చేశాడు. ఆదిత్య శ్రీనివాసన్ ప్రస్తుతం చెన్నైలోని యాక్సెంచర్‌లో పనిచేస్తున్నారు. ఏథెన్స్‌లోని జార్జియా వర్సిటీ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు ఆదిత్య రామ్ శంకర్. ఆదిత్య మాట్లాడుతూ..‘నేను కెరీర్ అవకాశాలు, ట్యూషన్, ఫీజులు, జీవన వ్యయం, వాతావరణం, వ్యక్తిగత ఇష్టం, జీవన పరిస్థితులు వంటి అన్నీ పరిశీలించాను. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం మీద ఏది మంచి ఎంపిక అని నేను అర్థం చేసుకోగలిగాను.’ అని చెప్పారు. ఆదిత్య రామ్ శంకర్ ప్రస్తుతం వర్జీనియాలోని ఒరాకిల్‌లో పనిచేస్తున్నారు.
ఆర్థిక సహాయం, విద్యార్థి వీసాలు
అన్ని దరఖాస్తులు సమర్పించిన తర్వాత, కాబోయే విద్యార్థి ప్రాథమిక పని నిధులను పొందడం. శంకర్, ఆదిత్య శ్రీనివాసన్ ఇద్దరూ లోన్ ప్రక్రియలను ముందుగానే ప్రారంభించాలని సిఫార్సు చేస్తున్నారు. ఆర్థిక సహాయం కోరుకునే విద్యార్థికి విద్యా రుణాలను పొందడం ముఖ్యమైన పని అని ఆదిత్య శ్రీనివాసన్ చెప్పారు. వడ్డీ రేట్లను సరిపోల్చడానికి వివిధ బ్యాంకులను సంప్రదించానని, లోన్ అప్రూవల్ ప్రాసెస్ సుదీర్ఘంగా ఉండవచ్చు కాబట్టి ముందుగానే చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వర్సిటీల్లోని స్కాలర్‌షిప్ అవకాశాలు, బయటి రిసోర్సులు కూడా చూడాలని శంకర్ పేర్కొన్నారు.
అనుభవాలు నేర్చుకోవడం
U.S. యూనివర్సిటీ క్యాంపస్‌కి వచ్చినప్పుడు అంతర్జాతీయ విద్యార్థులు అనేక కొత్త అనుభవాలు పొందుతారు. ప్రధానంగా భారతదేశంలోని విద్యా విధానానికి యూఎస్‌లోని విద్యావిధానానికి తేడా ఉంటుంది. యూఎస్‌లో విద్యావ్యవస్థ విద్యార్థులను నిరంతరం విద్యార్థిపై దృష్టి ఉంటుందని, భారతీయ వ్యవస్థలో చివరి సెమిస్టర్‌లు లేదా ఫైనల్స్‌లో ఎక్కువ భారం పడుతుందని వివరించారు. యూఎస్‌లో లెక్చర్‌లకు అనుగుణంగా హోంవర్క్, ప్రాజెక్ట్‌లు క్రమం తప్పకుండా ఇవ్వడం నచ్చుతుందని, కాల వ్యవధిలో క్రమంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుందని, ఒక నిర్దిష్ట రంగంలో స్పెషలైజేషన్‌కు చాలా ప్రాధాన్యత ఇవ్వవచ్చని చెప్పారు. ప్రొఫెసర్‌లతో ఆఫీసు వేళలు అనేది U.S. ఉన్నత విద్యలో మరొక కొత్త కోణం. విద్యార్థులు ఈ సమయంలో ప్రొఫెసర్లను కలుసుకుని వారి ప్రశ్నలపై స్పష్టత పొందవచ్చు.
* క్యాంపస్ లైఫ్
వైబ్రెంట్ యూనివర్సిటీ క్యాంపస్ గురించి ఆదిత్య శ్రీనివాసన్ మాట్లాడుతూ..‘స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. మేము టెన్నిస్, క్రికెట్ వంటివి ఆడుతూ సాయంత్రం మైదానంలో గడిపాం. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్ సెంటర్‌లో పార్ట్ టైమ్ పని చేశాను. వివిధ దేశాలకు చెందిన వారు స్నేహితులు అయ్యారు.’ అని చెప్పారు.
* ఇంటర్న్‌షిప్‌లు, OPT
ఆదిత్య శ్రీనివాసన్ తన ఇంటర్న్‌షిప్ కోసం క్యాంపస్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంటర్న్‌షిప్, ఉద్యోగ దరఖాస్తులను నావిగేట్ చేయడానికి యూనివర్సిటీ కెరీర్ సెంటర్‌ను శంకర్ బాగా ఉపయోగించుకొన్నారు. పరిశ్రమ ఇంటర్న్‌షిప్ అందుబాటులో లేని విద్యార్థుల కోసం, క్యాంపస్ ఆ లోటును పూరిస్తుందని, అనుభవాన్ని మెరుగుపరుచుకోవడానికి పుష్కలమైన అవకాశాలను అందిస్తుందని అని శంకర్ చెప్పారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT), కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (CPT) వాటికి సంబంధించిన నియమాల గురించి క్షుణ్ణంగా చదవాలని ఆఆదిత్య శ్రీనివాసనన్ సూచిస్తున్నారు. U.S. ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్ లేదా యూనివర్సిటీ ఇమ్మిగ్రేషన్ పేజీల నుంచి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. మొదటి సెమిస్టర్ నుంచి వర్సిటీ కెరీర్ సెంటర్‌తో కలిసి పనిచేయాలని శంకర్ సలహా ఇస్తున్నారు.
* అమూల్యమైన నైపుణ్యాలు
U.S. ఉన్నత విద్య అనేక ఇతర విశేషమైన లక్షణాలు అర్ధవంతమైన జీవితాలను, వృత్తిని నిర్మించుకోవడానికి వేలాది మంది గ్రాడ్యుయేట్‌లకు శక్తినిచ్చాయి. ఇప్పటివరకు నా కెరీర్‌ను మరింత మెరుగైన మార్గంలో నావిగేట్ చేయడంలో సహాయపడిందని, యూనివర్శిటీలో ప్రొఫెసర్‌లు, సహ విద్యార్థులతో ఎలా ఇంటరాక్ట్ అయ్యాను, ఈ రోజు సహోద్యోగులతో నేను ఎలా పని చేస్తున్నాను అనే దాని మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని శంకర్ చెప్పారు. ఒక వ్యక్తిగా మరింత సమాచారం తీసుకోవడానికి, మరింత బాధ్యతాయుతంగా, సమయాన్ని మెరుగ్గా నిర్వహించడానికి ఉపయోగపడిందన్నారు. ఆదిత్య శ్రీనివాసన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం అరిజోనా స్టేట్ యూనివర్సిటీ టెంపే క్యాంపస్ నుండి గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, తన రోజువారీ పనిలో ప్రొఫెసర్లు బోధించిన భావనలు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయని అన్నారు.
ఈ స్టోరీ మొదట స్పాన్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Colleges, Higher education, Research, University