కరోనా కారణంగా దేశంలో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎప్పుడు స్కూళ్లు కాలేజీలు తెరుచుకుంటాయో? మళ్లీ ఎప్పుడు మూతబడతాయో? తెలియని దుస్థితి ఈ మహమ్మారి కారణంగా నెలకొంది. ప్రస్తుతం ఈ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గడంతో తరగతులను తిరిగి ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ సైతం స్కూళ్ల ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి, ఆ పై తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం విధించిన పలు ఆంక్షాలను పలు సడలింపులు ఇస్తూ పొడిగించింది. ఇంకా కరోనా ప్రభావం అత్యధికంగా పడిన పరిశ్రమల్లో సినిమా పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు నెలల పాటు మూతబడడంతో వాటిపై ఆధారపడిన అనేక మంది వీధిన పడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సినిమా థియేటర్ల ప్రారంభంపై సైతం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది.
India Covid: ఇండియాలో కొత్త కేసులెన్ని, మరణాలెన్ని.. కరోనా బులిటెన్ అప్‌డేట్స్
ZyCoV-D Vaccine: సూది లేకుండానే ఇంజెక్షన్... నొప్పి తెలియకుండా పిల్లలకు కరోనా టీకా
సినిమా థియేటర్ల సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని స్పష్టం చేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఇంకా రాష్ట్రంలో బార్‌లు, హోటళ్లు, క్లబ్‌లను ప్రారంభించడానికి సైతం ఓకే చెప్పింది తమిళనాడు ప్రభుత్వం. అయితే వాటిలో పని చేసే సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని తెలిపింది. ఇంకా వీధి వ్యాపారులు, దుకాణదారులు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకొనేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
AP Curfew Extended: ఏపీలో మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, రూల్స్ ఇవే..
వాటికి సైతం అనుమతి..
బొటానికల్, జూ పార్కులు తెరిచేందుకు కూడా తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు కూడా 100శాతం సిబ్బందితో పని చేయొచ్చని తెలిపింది. పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు సైతం బస్సు సర్వీసులు నడిపేందుకు ఓకే చెప్పింది. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న కరోనా ఆంక్షలను పలు సడలింపులతో సెప్టెంబర్ 9వరకు పొడిగిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona lockdown, Schools reopening, Tamil nadu, Theaters