అతడికి బ్యాంకులో ఉద్యోగం.. నిశ్చితార్థం జరిగింది.. ఆ మరుసటి రోజే అతడు చేసిన పనికి..

అనంత కృష్ణన్

వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..అతడు ఊహించని చర్యకు పాల్పడ్డాడు.

 • Share this:
  వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే నిశ్చితార్థం జరిగిన మరసటి రోజే యువతి ఇంటికి వచ్చిన యువకుడు.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం‌లో చోటుచేసుకుంది. వివరాలు.. చెక్కమద్నాడ్‌ ప్రాంతానిక చెందిన అనంత కృష్ణన్(29).. అలువాలోని ఓ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అతనికి మే నెలలో ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే వారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించాడు. అయితే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే.. అనంత కృష్ణన్ యువతికి ఇంటికి వెళ్లాడు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు.. ఇంట్లో లేరు. వారు బయటకు వెళ్లారు.

  ఈ విషయాన్ని అదనుగా తీసుకున్న అనంత కృష్ణన్‌ యువతిపై లైంగిక వేధింపులకు యత్నించాడు. అయితే యువతి ప్రతిఘటించడంతో.. తన చర్యలను నిలిపివేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటన తర్వాత అతను యువతిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. అయితే వరకట్నం కింద బంగారం, కారు డిమాండ్ చేశాడు.

  ఇవి చదవండి:  Wanaparthy: పసికందుతో పాటు భార్యభర్తల కిడ్నాప్.. గదిలో నిర్బంధించి చిత్ర హింసలు.. అసలేం జరిగిందంటే..

  Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో దారుణం.. పట్టపగలే యువతిపై అత్యాచారం.. పోలీసులు ఏం చెప్పారంటే..

  Online Classes: ఆన్‌లైన్ క్లాసులు.. ఈ పిల్లాడికి జరిగినట్టుగా మరెవరికి జరగకూడదు..

  తాను అడిగిన మొత్తం చెల్లించకపోతే.. యువతిని పెళ్లి చేసుకోనని బెదిరించాడు. ఈ క్రమంలోనే యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అనంత కృష్ణన్‌పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత అనంత కృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతని మువత్తుపుజ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.
  Published by:Sumanth Kanukula
  First published: