Kerala: దేశంలో విద్య, వైద్యం, టూరిజం వంటి రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న కేరళ.. మరో చరిత్రాత్మక నిర్ణయానికి వేదికగా మారింది. రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీ, పీరియడ్స్ సమయంలో విద్యార్థిణులు లీవ్ తీసుకునేందుకు ప్రత్యేకంగా ‘మెన్‌స్ట్రేషన్ బెనిఫిట్’ పేరుతో హాజరు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT) ఈమేరకు ప్రకటన చేసింది. ప్రతి సెమిస్టర్లో విద్యార్థిణులకు మెన్‌స్ట్రేషన్ బెనిఫిట్ కింద హాజరులో రెండు శాతం మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.
యూనివర్సిటీ రూల్ ప్రకారం.. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలి. పరీక్షలకు హాజరు కావాలంటే ప్రతి సెమిస్టర్‌లో ఈ హాజరు శాతం తప్పనిసరి. అయితే అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న సందర్భంలో, ఫిమేల్ స్టూడెంట్స్ మెన్‌స్ట్రేషన్ బెనిఫిట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వీరికి మినిమం అటెండెన్స్ పర్సంటేజ్ 73 శాతానికి తగ్గినా ఫర్వాలేదు.
వర్సిటీ ఉత్తర్వులు
ఈ విషయంపై యూనివర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు ‘ఫిమేల్ స్టూడెంట్స్‌కు మెన్‌స్ట్రేషన్ బెనిఫిట్స్ కావాలనే అభ్యర్థనలను వైస్-ఛాన్సలర్ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి సెమిస్టర్‌లో మహిళా విద్యార్థులకు హాజరు మినహాయింపు 2 శాతం మంజూరు చేయాలని ఆదేశించారు. అకడమిక్ కౌన్సిల్ ఆదేశాలకు లోబడి ఈ రూల్ వర్తిస్తుంది.’ అని ఆర్డర్‌లో ఉంది. CUSATలోని మహిళా విద్యార్థులందరికీ, పీహెచ్‌డీ చదువుతున్న వారికి కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది. విధానపరమైన ఆమోదం కోసం ఇప్పుడు ఈ ఆర్డర్‌ను అకడమిక్ కౌన్సిల్‌కు సమర్పించనున్నారు. ఆమోదం లభించిన వెంటనే, ఈ రూల్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
UGC: ఉన్నత విద్యాసంస్థలకు యూజీసీ లేఖ.. ఇతర సంస్థలకు లైబ్రరీ, ల్యాబ్ యాక్సెస్ అందించాలని విజ్ఞప్తి..!
స్టూడెంట్స్ డిమాండ్
వర్సిటీ విద్యార్థులు గత కొంతకాలంగా అటెండెన్స్ రిలీఫ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. వివిధ విద్యార్థి సంఘాలు దీనిపై ఒత్తిడి చేస్తున్నాయి. మెన్‌స్ట్రేషన్ బెనిఫిట్ కోసం వీరు వర్సిటీ వీసీకి అధికారికంగా ప్రతిపాదనలు సమర్పించారు. తర్వాత వీసీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అనంతరం జాయింట్ రిజిస్ట్రార్ దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం హాజరులో మినహాయింపు
అయితే అటెండెన్స్ కండొనేషన్ ప్రతి విద్యార్థికి భిన్నంగా ఉంటుంది. ఇది స్టూడెంట్ మొత్తం హాజరుపై ఆధారపడి ఉంటుందని, నిర్ణీత సెలవులు అంటూ ప్రత్యేకంగా ఉండవని వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. ‘ఇది ప్రతి విద్యార్థికి భిన్నంగా ఉంటుంది. ప్రతి మహిళా విద్యార్థి తమ మొత్తం హాజరులో రెండు శాతాన్ని మెన్‌స్ట్రేషన్ బెనిఫిట్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే సరైన సెలవుల సంఖ్యను ఆర్డర్‌లో పేర్కొనలేదు’ అని అధికారి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.