Blockchain Academy: బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై రెండు ఉచిత కోర్సులు... కేరళ బ్లాక్‌ చెయిన్‌ అకాడమీ ప్రకటన

Blockchain Academy: బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై రెండు ఉచిత కోర్సులు... కేరళ బ్లాక్‌ చెయిన్‌ అకాడమీ ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)

Blockchain Academy | బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ (Blockchain Technology) గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి గుడ్ న్యూస్. కేరళ బ్లాక్‌చెయిన్ అకాడమీ ఉచితంగా బ్లాక్‌ చెయిన్‌ ఫౌండేషన్, ఇథిరియం ఫండమెంటల్స్‌ ప్రోగ్రామ్స్‌‌ని అందిస్తోంది.

  • Share this:
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో బ్లాక్‌ చైన్‌ (Blockchain) టెక్నాలజీకి ప్రాధాన్యత చాలా పెరిగిపోతోంది. బ్లాక్‌ చెయిన్‌ అనేది సమాచారాన్ని రికార్డు చేసే ఒక వ్యవస్థ. దాన్ని మార్చడం, హ్యాక్‌ చేయడం లేదా దారి మళ్లించడం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే అసాధ్యం. కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో (Computer Network) పదే పదే జరిగే పనులు లేదా పంపిణీ అయ్యే లావాదేవీలకు సంబంధించిన డిజిటల్‌ లెడ్జర్‌గా బ్లాక్‌ చెయిన్‌ను చెప్పుకోవచ్చు. 2008 నుంచి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా.. 2017లో బిట్‌ కాయిన్‌ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ బాగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ప్రాధాన్యతను గుర్తించిన కేరళ బ్లాక్‌ చెయిన్‌ అకాడమీ (Blockchain Academy) బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో రెండు ప్రైమరీ ప్రోగ్రామ్స్‌ను ఉచితంగా అందిస్తోంది. కేరళ ప్రభుత్వ డిజిటల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుంది. నవంబర్‌లో ప్రారంభమయ్యే బ్లాక్‌ చెయిన్‌ ఫౌండేషన్, ఇథిరియం ఫండమెంటల్స్‌ ప్రోగ్రామ్స్‌ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇవి ఆన్‌లైన్‌లో ఒక నెల కాలం పాటు సాగే కోర్సులు. వీటి కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆన్‌లైన్‌ కోర్సులో ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్లతో ఇంటరాక్షన్స్ కూడా ఉంటాయి. విద్యార్థులు, గ్రాడుయేట్లు, ప్రొఫెషనల్స్ ఎవరైనా ఎడ్యుకేషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా ఈ కోర్సులో చేరవచ్చు.

IT Jobs: ఫ్రెషర్స్‌కు బంపర్ ఆఫర్... ఈ మూడు ఐటీ కంపెనీల్లో 1,05,000 ఉద్యోగాలు

సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి బ్లాక్‌ చెయిన్‌కు మించిన టెక్నాలజీ లేదు. బ్లాక్‌ చెయిన్‌ అనగానే బిట్‌కాయిన్‌, క్రిప్టో కరెన్సీ గుర్తుకు వస్తుంది. కానీ ఇది ఎన్నో రంగాలకు విస్తరించింది. ప్రజల రికార్డుల పరిరక్షణకు చాలా ప్రభుత్వాలు బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఓటింగ్‌లో పారదర్శకత పెంచేందుకు, మోసాలు తగ్గించేందుకు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తోంది.

Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... భారతీయ రైల్వేలో 16,259 ఉద్యోగాలు

బ్లాక్‌ చెయిన్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌లో బ్లాక్‌ చెయిన్‌ ఫండమెంటల్స్‌, ముఖ్యమైన కాన్సెప్ట్స్‌, సామర్థ్యాలు, పరిమితులు, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ భవిష్యత్తుకు సంబంధించిన లోతైన బోధన ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కేరళ బ్లాక్‌ చెయిన్‌ అకాడమీ KBA, కేరళ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్ట్రాటజీ కౌన్సిల్‌ (K-DISC) సంతకంతో కూడిన డిజిటల్‌ బ్లాక్‌ చెయిన్‌ సర్టిఫికేట్‌ అందించడం జరుగుతుంది.

ONGC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

ఉచితంగా అందించే మరో బేసిక్‌ ప్రోగ్రామ్‌ ఇథిరియం బ్లాక్‌ చెయిన్‌లో ఇథిరియం బ్లాక్‌ చెన్‌ డొమెయిన్‌లో అప్లికేషన్ల రూపకల్పనకు సంబంధించిన మార్గదర్శకాలను అందిస్తుంది. ఈ కోర్సును మెరిట్‌లో పాసయ్యే వారికి ఆయా సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌ లెర్నింగ్‌ కోసం ఫీజులో 50 శాతం డిస్కౌంట్‌ అందించడం జరుగుతుంది. అయితే ఈ డిస్కౌంట్‌ పొందేందుకు సర్టిఫికేట్‌ అందుకున్న 15 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు 2021 అక్టోబర్‌ 30 చివరి తేదీ.
Published by:Santhosh Kumar S
First published: