KENDRIYA VIDYALAYAS RECOMMENDED QUOTA FOR MPS IN KENDRIYA VIDYALAYAS ADMISSIONS CANCELED AND RULES CHANGED GH VB
Kendriya Vidyalayas: కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్లలలో ఆ కోటా రద్దు.. మారిన రూల్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పార్లమెంట్ సభ్యులు విద్యార్థులను సిఫారస్సు చేసే కోటాను రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందని కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పార్లమెంట్(Parliament) సభ్యులు విద్యార్థులను సిఫారస్సు చేసే కోటాను రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుందని కేంద్రం ప్రకటించింది. విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లలు, ఎంపీల పిల్లలు, కేంద్రీయ విద్యాలయాల్లో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పిల్లలకు అడ్మిషన్లు మంజూరు చేయడానికి ఉన్న ప్రత్యేక నిబంధనలను తొలగించారు. అలాగే పాఠశాల మేనేజ్మెంట్(School Management) కమిటీ చైర్మన్(Committee Chairman) కోటా సైతం రద్దు చేశారు. కేంద్రీయ విద్యాలయాలను నిర్వహించే విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన కేంద్రీయ విద్యాలయ సంగతన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రవేశాల కోసం ప్రత్యేక నిబంధనలను సమీక్షించిన తరువాత సవరించిన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు.
గతంలో ఎంపీల కోటా ద్వారా ప్రతి ఏడాది 1 నుంచి 9 తరగతుల్లో ప్రవేశానికి ప్రతి ఎంపీ 10 మంది విద్యార్థులను సిఫార్సు చేసేవారు. నిబంధనల ప్రకారం ఎంపీ సిఫారస్సు చేసే 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీ నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి. లోక్ సభలో 543 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది ఎంపీలను కలుపుకుంటే ప్రతి ఏడాది దాదాపు 7,880 అడ్మిషన్లను సమిష్టిగా సిఫార్సు చేసేవారు. 1975 నుంచి ఈ కోటా అమల్లోకి వచ్చింది. అయితే ప్రతిభ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శలు రావడంతో గతంలో రెండు సార్లు ఎంపీల కోటాను రద్దు చేశారు. అయితే తరువాతి కాలంలో మళ్లీ పునరుద్ధరించారు. అధికారిక సమాచారం ప్రకారం... 2018-19లో ఎంపీల కోటా కింద కేంద్రీయ విద్యాలయాల్లో 8,164 అడ్మిషన్లు జరిగాయి. అదే 2021-22లో ఈ సంఖ్య 7,301 ఉంది.
అంతకు ముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్... విద్యా మంత్రుల విచక్షణ కోటా ద్వారా అడ్మిషన్లు చేపట్టే ప్రక్రియను నిలిపివేశారు. 2019-20 , 2020-21 అకడమిక్ ఇయర్స్‌లో ఈ కోటా ద్వారా వరుసగా 9,411, 12,295 అడ్మిషన్లు జరిగాయి.
* వారికి మాత్రం అలాటే..
పరమ వీరచక్ర, మహా వీరచక్ర, వీరచక్ర, అశోక్ చక్ర, కీర్తిచక్ర, శౌర్య చక్ర గ్రహీతల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఉన్న ప్రత్యేక నిబంధనను కేంద్రం తొలగించలేదు. అంతేకాకుండా జాతీయ శౌర్య పురస్కార గ్రహీతలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) ఉద్యోగులకు సంబంధించిన 15 మంది పిల్లలు, కోవిడ్-19 కారణంగా అనాథలైన పిల్లలు, మరణించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లలిత కళలలో విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలకు అడ్మిషన్లు కల్పించనున్నారు. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న 1248 కేంద్రీయ విద్యాలయాల్లో14,35,562 మంది విద్యార్థులు ప్రవేశాల కోసం నమోదు చేసుకున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.