హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ అప్‌డేట్.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ అప్‌డేట్.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ అప్‌డేట్.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ అప్‌డేట్.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) టీచింగ్-నాన్ టీచింగ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగా, తాజాగా  తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) టీచింగ్-నాన్ టీచింగ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగా, తాజాగా తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(KVS) టీచింగ్-నాన్ టీచింగ్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమిషనర్, లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. తాజాగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్ష తేదీల వివరాలను కేవీఎస్ వెల్లడించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ kvsangathan.nic.in ద్వారా పరీక్షల తేదీలను చెక్ చేసుకోవచ్చు.

* తాత్కాలిక షెడ్యూల్ డౌన్‌లోడ్ ప్రాసెస్

ముందుగా KVS అధికారిక వెబ్‌సైట్ kvsangathan.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలో KVS Direct Recruitment 2022 అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

దీంతో పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. మీరు దరఖాస్తు చేసుకున్న పోస్టు పరీక్ష తేదీలను చెక్ చేసుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని సేవ్ చేసుకోండి.

* తాత్కాలిక షెడ్యూల్ వివరాలు

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు ఫిబ్రవరి 7న పరీక్ష జరగనుంది. ప్రిన్సిపల్ పోస్టులకు ఫిబ్రవరి 8న, వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రైమరీ టీచర్ (మ్యూజిక్) పోస్టులకు ఫిబ్రవరి9న పరీక్ష జరగనుంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఫిబ్రవరి 20న, ప్రైమరీ టీచర్ పోస్టులకు ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం మార్చి 1 నుంచి 5 వరకు పరీక్షలు జరగనుండగా, మార్చి 5న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II, మార్చి 6న లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

* త్వరలో అడ్మిట్ కార్డ్స్ జారీ

కేవీఎస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు ఫిబ్రవరి 7న ప్రారంభమై, మార్చి7న ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ త్వరలో జారీ కానున్నాయి. రాత పరీక్ష, క్లాస్ డెమో/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా వివిధ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇది కూడా చదవండి : జొమాటో కొత్త రిక్రూట్‌మెంట్.. 800 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్.. వివరాలివే..

* ఖాళీల వివరాలు

ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తంగా 6,990 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ కమిషనర్-52 పోస్టులు, ప్రిన్సిపల్-239 పోస్టులు, వైస్ ప్రిన్సిపల్-203, పీజీటీ-1409, టీజీటీ-3176, లైబ్రేరియన్-355, పీఆర్టీ మ్యూజిక్-303, ఫైనాన్స్ ఆఫీసర్-6, అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్)-2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-156, హిందీ ట్రాన్స్ లేటర్-11, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-322, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-702, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II: -54 పోస్టులను భర్తీ చేయనున్నారు.

First published:

Tags: EDUCATION, JOBS, Kvs, Latest jobs, Teaching

ఉత్తమ కథలు