హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

KVS Online Application Process: ఉపాధ్యాయ కొలువులకు ప్రారంభం అయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. Step By Step దరఖాస్తు ఇలా.. 

KVS Online Application Process: ఉపాధ్యాయ కొలువులకు ప్రారంభం అయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. Step By Step దరఖాస్తు ఇలా.. 

KVS Online Application Process: ఉపాధ్యాయ కొలువులకు ప్రారంభం అయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. Step By Step దరఖాస్తు ఇలా.. 

KVS Online Application Process: ఉపాధ్యాయ కొలువులకు ప్రారంభం అయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. Step By Step దరఖాస్తు ఇలా.. 

KVS Online Application Process: నిరుద్యోగులకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాసెస్ పూర్తి వివరాలిలా..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ‌ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో(Online) డిసెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Jobs In Telangana: తెలంగాణలో 1491 పోస్టులకు నోటిఫికేషన్.. జిల్లాల వారీగా పోస్టులు.. 8 రోజుల్లో ఉద్యోగంలోకి..

పోస్టులు ఇలా..

ప్రిన్సిపల్- 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్- 203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-1409 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)- 3176 పోస్టులు, ప్రైమరీ టీచర్(పీఆర్‌టీ)-6414, లైబ్రేరియన్- 355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్- 52 పోస్టులు, పీఆర్‌టీ(మ్యూజిక్‌)- 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్- 06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)- 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్‌వో)-156 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్‌- 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(యూడీసీ)- 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్‌డీసీ)- 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత ప్రమాణాలు..

పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి. PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), లైబ్రేరియన్‌ పోస్టులకు 35 సంవత్సరాలు, PRT పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2: ఇక్కడ అనౌన్స్ మెంట్ అనే విభాగంలో వివిధ విభాగాలకు సంబంధించి పోస్టుల ఆన్ లైన్ అప్లై అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో మీకు తగిన భాగం ఎంచుకోవాలి.

Step 3: పీటీటీ, ప్రిన్సిపల్స్, టీజీటీ, నాన్ టీచింగ్ వంటి విభాగాల్లో మీరు దేనికి దరఖాస్తు చేస్తారో దానిని ఎంచుకోవాలి.

Step 4: మీరు ఒక వేళ నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసి.. దరఖాస్తు చేసుకోవచ్చు.

Step 5: దీనిలో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ యొక్క వివరాలను నమోదు చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్, ఈ మెయిల్ కు పాస్ వర్డ్, యూజర్ నేమ్ వస్తుంది.

Step 6: పాస్ వర్డ్, యూజర్ నేమ్ ఉపయోగించి ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనిలో అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేసి.. సబ్ మిట్ చేయాలి.

Step 7: చివరగా.. మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.

First published:

Tags: JOBS, Kvs, Teacher jobs

ఉత్తమ కథలు