Home /News /jobs /

KENDRIYA VIDYALAYA MAHABUBNAGAR INVITES APPLICATIONS FOR PGT TGT PRT AND OTHER VACANCIES SS

KVS Recruitment 2021: మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు

KVS Recruitment 2021: మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు
(ప్రతీకాత్మక చిత్రం)

KVS Recruitment 2021: మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు (ప్రతీకాత్మక చిత్రం)

KVS Mahabubnagar Recruitment 2021 | టీచర్ జాబ్ కోరుకునేవారికి శుభవార్త. మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

    ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి శుభవార్త. మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 8 చివరి తేదీ. మార్చి 10న రాతపరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రీయ విద్యాలయాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో ఖాళీల భర్తీకి రాతపరీక్ష, ఇంటర్వ్యూ జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ లాంటి పోస్టులు భర్తీ చేయనుంది కేంద్రీయ విద్యాలయ. ఇవి పార్ట్‌టైమ్, కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. 2021-22 విద్యా సంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mahabubnagar.kvs.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి.

    RBI Recruitment 2021: టెన్త్ పాస్ అర్హతతో ఆర్‌బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్ జాబ్స్

    NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయినవారికి 1145 జాబ్స్... అప్లై చేయండి ఇలా

    KVS Mahabubnagar Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    పీజీటీ- ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్
    టీజీటీ- ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్
    పీఆర్‌టీ
    కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్
    స్టాఫ్ నర్స్ లేదా కౌన్సిలర్
    మ్యూజిక్
    ఆర్ట్ అండ్ క్రాఫ్ట్
    స్పోర్ట్స్ కోచ్

    DSSSB Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 1809 ఉద్యోగాలకు అప్లై చేయండిలా

    ESIC Recruitment 2021: ఈఎస్ఐలో మెగా రిక్రూట్‌మెంట్... మొత్తం 6,552 ఖాళీలు

    KVS Mahabubnagar Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 8
    రాతపరీక్ష- 2021 మార్చి 10
    ఇంటర్వ్యూ- మెసేజ్, ఇమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వనున్న కేంద్రీయ విద్యాలయ
    విద్యార్హతలు- పీజీటీ పోస్టుకు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ పాస్ కావాలి. టీజీటీ పోస్టుకు డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి. పీఆర్‌టీ పోస్టుకు ఇంటర్ పాస్ కావడంతో పాటు రెండేళ్ల ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సు పాస్ కావాలి. సీటెట్ క్వాలిఫై అయినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
    ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ. రాతపరీక్షలో క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలి.
    వేతనం- కేంద్రీయ విద్యాలయ నియమనిబంధనల ప్రకారం లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, Mahabubnagar, Mahbubnagar, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు