హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Prelims Exam: ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గింపు.. కేసీఆర్ కీలక నిర్ణయం..

TSLPRB Prelims Exam: ఎస్సై, కానిస్టేబుల్ అర్హత మార్కులు తగ్గింపు.. కేసీఆర్ కీలక నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కానిస్టేబుల్, ఎస్సై అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానిస్టేబుల్, ఎస్సై  ప్రిలిమ్స్ పరీక్షల అర్హత మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

కానిస్టేబుల్(Constable), ఎస్సై(Sub Inspector) అర్హత మార్కులను తగ్గిస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానిస్టేబుల్, ఎస్సై  ప్రిలిమ్స్ పరీక్షల అర్హత మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్కులను తగ్గిస్తామని ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి ఎస్సీ, ఎస్టీ లతో పాటు బీసీ అభ్యర్థులు రిజర్వేషన్ల(Reservations) విషయంలో అన్యాయం జరిగిందంటూ ఆందోళనలను చేపడతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులను(Cut Off Marks) తగ్గించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఈ నెల 28వ తేదీన నిర్వహించారు. తర్వాత ఐదు రోజులకు ప్రిలిమనరీ కీను కూడా విడుదల చేశారు. అయితే దీనిలో 5 ప్రశ్నలకు సంబంధించి సమాధానలను తప్పులుగా ఉన్నట్లు కీలో పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన బోర్డు తుది ఫలితాలను వెల్లడించలేదు. ఈ లోపే తమకు అన్యాయం జరిగిందంటూ ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

కానిస్టేబుల్ అండ్ ఎస్సై పరీక్షలో అభ్యర్థుల యొక్క అర్హత మార్కులను అందరికీ సమానంగా 30 శాతం రావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే అంతక ముందు నిర్వహించిచ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం అర్హత మార్కులు వస్తే.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వారు. కానీ ఇటీవల వల విడుదల చేసి నోటిఫికేషన్లో అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఈ సారి నెగెటివ్ విధానం కూడా తీసుకొచ్చారు.

IGNOU July 2022 Admission: మరోసారి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించిన ఇగ్నో.. చివరి తేదీ ఎప్పుడంటే..

ఇంత వరకు బాగానే ఉన్నా.. 40 శాతంగా ఉన్న ఓసీ అభ్యర్థులకు 10 శాతం సడలింపు ఇచ్చి, బీసీ అభ్యర్థులకు కూడా 5 శాతం రిజర్వేషన్ సడలింపు ఇచ్చి.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి సడలింపు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు కూడా రిజర్వేషన్ లో సడలింపు ఇచ్చి.. అర్హత మార్కులను తగ్గించాలంటూ గత కొన్ని రోజుల నుంచి ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షడు మంద కృష్ణ మాదిగతో పాటు.. అశోక్ ఆన్ లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ విద్యార్థులతో కలిసి ఓయూలో ఆందోళనలు చేపట్టారు. తాజాగా కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీ అభ్యర్థులకు అర్హత మార్కుల తగ్గింపుపై క్లారిటీ లేదు.

First published:

Tags: Career and Courses, JOBS, Tslprb

ఉత్తమ కథలు