తెలుగు టీవీ చానెళ్లను (TV Channels) ఫాలో అయ్యే వారందరికీ కార్తీక దీపం సీరియల్ (Karthika Deepam) అందులో వంటలక్క అంటే తెలియని వారుండరంటే అతిషయోక్తి కాదు. తెలుగు సీరియల్ ప్రేక్షకులపై అంతలా ముద్ర వేసింది ఆ సీరియల్. ఇంకా ఆ సీరియల్ (Daily Serial) గురించి నెట్లో వచ్చే కామెంట్లు, వార్తలను చూసి సీరియల్స్ అంటే తెలియని వాళ్లు కూడా నెట్లో వెతికి మరీ ఆ సీరియల్ ను చూశారు. వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియలో ఉండే ప్రేమి విశ్వనాథ్ తనకు సంబంధించిన అప్ డేట్స్ ను పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఆమె తన ఫేస్ బుక్ ఖాతా వేధికగా ఓ కీలక ప్రకటన చేశారు. పలు ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. డ్రైవర్, అకౌంటెంట్ ఉద్యోగాల అభ్యర్థులు కావాలని తెలిపారు.
డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి అన్ని రకాల 4 వీలర్స్ (Automatic, Manual) వాహనాలను నడిపడం వచ్చి ఉండాలని ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు కొచ్చిలోని ఎర్నాకులంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా అకౌంటెంట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారికి Tally వచ్చి ఉండాలన్నారు.
Jobs in AP: ఏపీలో ఎల్లుండి జాబ్ మేళా.. రూ.15 వేల వేతనంతో జాబ్స్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
ఇంకా రెండేళ్ల అనుభవం ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్ లింక్ షేర్ చేయలేదు వంటలక్క. దీంతో ఆసక్తి కలిగిన వారు తమ గురించి వివరాలను కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు. అయితే.. ఇందులో ఎంత మందికి ప్రేమీ విశ్వనాథ్ ఉద్యోగాలను ఇస్తుందో చూడాలి మరీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karthika deepam, Premi Vishwanath, Railway jobs, TV channels, Vantalakka