ప్రతి సబ్జెక్టులోనూ నైపుణ్యంతో పాటు బోధనా నాణ్యతను మెరుగుపరచుకుంటూ తద్వారా విద్యార్థుల్లో నేర్చుకునే తత్వాన్ని పెంపొందించవచ్చని అమిత్ అభిప్రాయపడుతున్నాడు. ఆరు వేర్వేరు సబ్జెక్టుల్లో యూజీసీ-ఎన్ఈటీలో అర్హత సాధించిన తొలి భారతీయుడిగా అమిత్ కుమార్ నిరంజన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల నిరంతర కృషితో ఈ స్థాయికి చేరుకున్నాడు. 2010లో మొదటి సారి కామర్స్ సబ్జెక్టులో యూజీసీ-ఎన్ఈటీకి అర్హత సాధించాడు. అదే ఏడాది డిసెంబరులో అర్ధశాస్త్రంలో అర్హత సాధించాడు. అయితే అంతటితో ఈ ఉపాధ్యాయుడి ప్రయత్నం ముగియలేదు.
ఐఐటీ కాన్పూర్ నుంచి PhD..
2012 డిసెంబరులో మేనేజ్మెంట్ సబ్జెక్టులో యూజీసీ-నెట్ కు అర్హత పొందాడు. 2015 డిసెంబరులో ఎడ్యుకేషన్ లో, 2019 డిసెంబరులో పొలిటికల్ సైన్స్, 2020లో సోషియాలజీలో యూజీసీ నెట్ కు క్వాలిఫై అయ్యాడు. 2015లో ఐఐటీ కాన్పూర్ నుంచి ఎకనామిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. ఈ విధంగా ఆరు వేర్వేరు సబ్జెక్టుల్లో యూజీసీ -నెట్ కు అర్హత సాధించడం పట్ల అమిత్ కుమార్ న్యూస్-18తో మాట్లాడాడు. ప్రస్తుతం విద్యం అనే సేవ కంటే వ్యాపారంలాగా మారిందని అన్నారు. విద్యార్థుల ఉత్సాహం, నిరంతరం ప్రశ్నలు సంధించడం తనకు ఎప్పటికీ అంతు లేని ప్రేరణ ఇచ్చిందని స్పష్టం చేశాడు. 37 ఏళ్ల వయసున్న అమిత్ కు.. ఎకనామిక్స్, కామర్స్ సెబ్జెక్టుల్లో 12 ఏళ్ల బోధనా అనుభవం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kanpur S24p43, Teacher, UGC NET