KALOJI UNIVERSITY RELEASED FINAL PHASE COUNSELLING NOTIFICATION FOR MBBS BDS ADMISSIONS IN PRIVATE MEDICAL COLLEGES NS
Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఆ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ(Kaloji Narayana Rao University of Health Sciences, KNRUHS) ఆదివారం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాలకు తుది విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిసెంబరు 29(మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. యూనివర్సిటీ విడుదల చేసిన ఫైనల్ మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన కౌన్సెలింగుల్లో సీటు పొంది.. చేరని అభ్యర్థులు, కళాశాలలో చేరిన కూడా డిస్కంటిన్యూ అయిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులని యూనివర్సిటీ ప్రకటించింది.
ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే అడ్మిషన్ పొందిన అభ్యర్థులు సైతం ఈ కౌన్సెలింగ్ కు అనర్హులని యూనివర్సిటీ తెలిపింది. కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తామని వెల్లడించింది. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్లో సంప్రదించాలని విద్యార్థులను కోరింది. ఇతర వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ http://www.knruhs.telangana.gov.in/ ను సందర్శించాలని అధికారులు సూచించారు.
కరోనా మహమ్మారితో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమయింది. మార్చి నుంచి ఇప్పటి వరకూ అదే పరిస్థితి. గత విద్యాసంవత్సరం పరీక్షలను నిర్వహించకుండానే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటున్నా.. పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదు. విద్యారంగం ఇంకా కోలేకోలేదు. ఇంకా చాలా చోట్ల స్కూళ్లు ప్రారంభం కాలేదు. కానీ అప్పుడే మళ్లీ పరీక్షల గోల మొదలయింది. సీబీఎస్ఈ (CBSE) 2021 బోర్డు ఎగ్జామ్స్‌పై కేంద్ర విద్యశాఖ కీలక ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 2020 తుది పరీక్షల తేదీలను డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నట్లు కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ''విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ముఖ్యమైన ప్రకటన. 2021 సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు సంబంధించిన తేదీలను డిసెంబరు 31న సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తాం.'' అని రమేష్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.