బెంగుళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (Defence Research and Development Organisation) లో జూనియర్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయ్యింది. DRDO రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
బెంగుళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (Defence Research and Development Organisation) లో జూనియర్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. DRDO రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు ఫెలోషిప్ చేయవచ్చు. అభ్యర్థి పనితీరు ఆధారంగా ఫెలోషిప్ కాల పరిమితిని పెంచే అవకాశం ఉంది. బాగా పని చేసిన వారిని సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అప్‌గ్రేడ్ చేస్తారు. జూనియర్ ఫెలోషిప్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,000 జీతం లభిస్తుంది.
అర్హతలు ఇవే..
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి కచ్చితంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గణితంలో ఫస్ట్ క్లాస్ డివిజన్‌తో మాస్టర్ డిగ్రీ, డిగ్రీ కలిగి ఉండాలి. వీటితోపాటు నెట్(NET), గేట్ (GATE) క్వాలిఫై అయి ఉండాలి.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ME లేదా MTech చేయాలి. వాటితోపాటు NET లేదా GATE క్వాలిఫై అయి ఉండాలి. AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తుదారులు క్రిప్టోగ్రఫీ, కోడింగ్ సిద్ధాంతం మరియు ప్రోగ్రామింగ్ భాషలలో నైపుణ్యం కలిగి ఉండటం కూడా మంచిది.
నోటిఫికేషన్లో ఉన్న దరఖాస్తు ఫాంను డౌన్లోడ్ చేసుకొని నింపాలి.
దరఖాస్తు నింపడం పూర్తయ్యాకా స్కాన్ కాపీని ముందుగా jrfcair2021@gmail.com కు 8 అక్టోబర్ 2021 సాయంత్రం 5 గంటలకు ముందు పంపాలి.
ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 18 మరియు 19 అక్టోబర్ 2021 న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ సెంటర్ (CAIR), DRDO కాంప్లెక్స్, CV రామన్ నగర్ బెంగళూరు 560093 లో నిర్వహించబడతాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.