DRDO Jobs: డీఆర్‌డీఓలో ఖాళీలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

image: DRDO

DRDO recruitment 2019 | రెండేళ్ల కాల వ్యవధికోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లను నియమిస్తోంది డీఆర్‌డీఓ. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 వేతనంతో పాటు హౌజ్ రెంట్ అలవెన్స్ ఇస్తారు.

  • Share this:
    భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో ఖాళీలున్నాయి. DRDO అనుబంధ సంస్థ అయిన నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ-NMRL విభాగంలో జూనియర్ రీసెర్చ్-JRF పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రెండేళ్ల కాల వ్యవధికోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లను నియమిస్తోంది డీఆర్‌డీఓ. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 వేతనంతో పాటు హౌజ్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. డీఆర్‌డీఓ జేఆర్ఎఫ్ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Read this: LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలు

    DRDO recruitment 2019: ఎవరు దరఖాస్తు చేయొచ్చు?


    మొత్తం నాలుగు జేఆర్ఎఫ్ పోస్టులు ఉన్నాయి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు ఒక్కో పోస్టు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలకు రెండు పోస్టుల్ని కేటాయించారు. ఆయా విభాగాల్లో ఎంఈ లేదా ఎంటెక్ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. పీజీ, గ్రాడ్యుయేట్‌లో ఫస్ట్ డివిజన్ మార్కులుండాలి. నెట్, గేట్ క్వాలిఫై కావాలి. ఆసక్తిగల అభ్యర్థులు మే 22 లోగా hodcomp@nmrl.drdo.in ఇమెయిల్ ఐడీకీ దరఖాస్తుల్ని పంపాలి. అభ్యర్థుల్ని నెట్ లేదా గేట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీలోనే పనిచేయాల్సి ఉంటుంది.

    Asus Zenfone 6: త్వరలో ఇండియాకి ఏసుస్ జెన్‌ఫోన్ 6... అదిరిపోయిన ఫీచర్స్ ఇవే


    ఇవి కూడా చదవండి:

    EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు

    SBI Jobs: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... వివరాలివే

    BSF Jobs: బీఎస్ఎఫ్‌లో 1072 ఉద్యోగాలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ
    First published: