సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (Centre For Airborne Systems) బెంగళూరు-డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఏరోనాటికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్(Communication) ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్(Engineering), మెకానికల్(Mechanical) ఇంజనీరింగ్‌తో సహా ఇంజనీరింగ్ ట్రేడ్‌లో అర్హులు. అభ్యర్థులు సీఏబీసీ (CABS)- డీఆర్డీఓ (DRDO) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ సమాచారం(Information) ఆధారంగా దరఖాస్తు(Application) చేసుకోవచ్చు. పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 1, 2021 వరకు అవకాశం ఉంది.
అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
ఏరోనాటికల్ ఇంజనీర్ | ఏరోనాటిక్ విభాగంలో ఇంజనీరింగ్(Engineering) పూర్తి చేసి ఉండాలి | 02 |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ | కంప్యూటర్స్(Computers) , ఐటీ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. | 05 |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ | ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి | 09 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | ఈఈఈ, ఎలక్ట్రికల్ (Electrical) పవర్ సిస్టమ్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి | 01 |
మెకానికల్ ఇంజనీరింగ్ | మెకానిక్(Mechanic) విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. | 03 |
ఎంపిక విధానం..
- గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల డిగ్రీ/ పోస్టు గ్రాడ్యుయేట్ స్కోర్‌తోపాటు గేట్(GATE) స్కోర్(Score)ను పరిగణలోకి తీసుకొంటారు
- ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు డీఆర్డీఓ (DRDO) వెబ్‌సైట్(www.drdo.gov.in)లో అప్‌లోడ్ చేస్తారు.
దరఖాస్తుచేసుకోనే విధానం..
- అభ్యర్థి ముందుగా డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి (వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి)
- అనంతరం అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి. (అప్లికేషన్ ఫాం కోసం క్లిక్ చేయండి)
- దరఖాస్తు ఫాంను నింపిన తరువాత నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఫార్మాట్‌లో నింపి jrf.rectt@cabs.drdo.in మెయిల్ ఐడీకి పంపాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 1, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS