Home /News /jobs /

JUNIOR MBA COURSE IN BRANDING AND DESIGN AMERICAN COMPANY OFFERING INDUSTRY CERTIFIED COURSE GH VB

New Course: బ్రాండింగ్ & డిజైన్‌లో జూనియర్ ఎంబీఏ కోర్సు.. ఇండస్ట్రీ- సర్టిఫైడ్ కోర్సు ఆఫర్ చేస్తున్న కంపెనీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన మల్టినేషన్ పుడ్ తయారీ కంపెనీ కెల్లాగ్స్(Kellogg’s) హైస్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 8 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ‘‘జూనియర్ MBA బ్రాండింగ్ & డిజైన్’’ పేరుతో ఇండస్ట్రీ-సర్టిఫైడ్ కోర్సును ప్రారంభించనుంది.

ఇంకా చదవండి ...
అమెరికాకు(America) చెందిన మల్టినేషన్ పుడ్ తయారీ కంపెనీ కెల్లాగ్స్(Kellogg’s) హైస్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 8 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ‘‘జూనియర్ MBA బ్రాండింగ్ & డిజైన్’’ పేరుతో ఇండస్ట్రీ-సర్టిఫైడ్ కోర్సును ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ Clever Harveyతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 15 రోజుల పాటు జరిగే ఈ కోర్సు ద్వారా కెల్లాగ్స్, విద్యార్థులకు పరిశ్రమ ప్రాజెక్ట్(Project) సమయంలో సృజనాత్మక నిపుణులు చేసే వర్క్‌పై అవగాహన కల్పించనుంది.  క్లెవర్ హార్వే( Clever Harvey ) ఫెసిలిటేటర్ల మార్గనిర్దేశంలో, రెండు లేదా మూడు గ్రూప్‌లతో కలిసి విద్యార్థులు(Students) పనిచేయనున్నారు. తద్వారా వ్యాపార ప్రపంచంలో అత్యంత సృజనాత్మక రంగాలలో ఒకటైన, ‘బ్రాండింగ్ అండ్ డిజైన్‌‌’పై అవగాహన పెంచుకోనున్నారు. వ్యూహాత్మక ఆలోచనలతో డిజైన్ ప్రోటోటైప్‌ల‌ను దశల వారీగా డెవలప్ చేయడం నేర్చుకుంటే ఈ రంగంలో విద్యార్థులకు బలమైన పునాది లభించినట్లేనని  క్లెవర్ హార్వే, కెల్లాగ్స్ సంస్థలు వెల్లడించాయి.

బ్రాండింగ్ అండ్ డిజైన్‌‌ సర్టిఫైడ్ కోర్సు ప్రారంభం సందర్భంగా క్లెవర్ హార్వే సహ వ్యవస్థాపకుడు శ్రీరామ్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, డిజిటల్ మార్కెటింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మెటావర్స్, ఎథికల్ కన్స్యూమరిజం వంటి వేరియబుల్స్ ‘బ్రాండింగ్ & డిజైన్’ పరిధిని విస్తృతం చేశాయన్నారు. టీనేజర్లకు ఇందులో లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్  సృష్టించడం కోసం కెల్లాగ్స్‌కు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

హ్యూమన్-సెంట్రిక్ డిజైన్, ప్యాకేజింగ్, సెన్సరీ డిజైన్ & విజువల్ డిజైన్ సూత్రాలతో సహా  వివిధ డిజైనింగ్ కాన్సెప్ట్‌ల ద్వారా విద్యార్థులు తమ వ్యూహాత్మక కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు.  ఈ రంగంలో కెరీర్‌ సక్సెస్ కోసం విద్యార్థులు అవసరమైన వాటిని సంగ్రహించి తద్వారా వినియోగదారుల పట్ల సానుభూతిని పెంపొందించడంలో ఇవి సహాయపడతాయని శ్రీరామ్ సుబ్రమణియన్  తెలిపారు.

కెల్లాగ్స్ అసోసియేట్ డైరెక్టర్ పూజ చందన మాట్లాడుతూ... ఈ రోజుల్లో  ఏ అంశంపై అయినా మల్టిపుల్ ఇంటర్న్‌షిప్‌లు చేయడం ద్వారా విద్యార్థులు ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ పొందుతారన్నారు. సాంకేతిక నైపుణ్యాలు, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం బ్రాండింగ్ అండ్ డిజైన్‌‌ రంగంలో పనిచేయడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థులకు వేటిపై శ్రద్ధాసక్తులు ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. తమకు నచ్చిన రంగాల్లో విజయం సాధించేందుకు ఈ అనుభవం కీలకంగా పనిచేస్తుందన్నారు.

Application Avatar: హైస్కూల్ విద్యార్థులకు అలర్ట్.. స్ట్రాంగ్ అప్లికేషన్ అవతార్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోండి..


ఇలాంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని పూజా చందన విద్యార్థులకు సూచించారు.  ప్యాకేజింగ్ అనేది వినియోగదారుల నమ్మకంలో కీలకమైందని..  వారితో పరస్పర చర్య చేసేందుకు ప్యాకేజింగ్ అనేది సంస్థకు సంబంధించిన స్పష్టమైన కమ్యూనికేషన్ ఆస్తి అని ఆమె అభివర్ణించారు.  క్లీవర్ హార్వేతో సహకారంతో  కెల్లాగ్స్ కోసం విద్యార్థులు ప్యాకేజింగ్‌ను ఎంత వినూత్నంగా చేస్తారో చూడడానికి తాము ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పూజ చందన పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Mba, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు