విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీజీ ప్రవేశాలకు జూన్ 30 తుది గడువు..

ఈ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు పీజీ కోర్సుల్లో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 496 రెగ్యులర్, 124 సెల్స్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి.

news18-telugu
Updated: May 31, 2020, 4:24 PM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీజీ ప్రవేశాలకు జూన్ 30 తుది గడువు..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యార్థులకు అంబేద్కర్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ అందించింది. పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. పీజీ ప్రవేశాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది. బీఆర్ఏయూఎస్‌కేఎల్ఎంసీఈటీ 2020-21 ప్రవేశ పరీక్ష ద్వారా యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉణ్న ఎనిమిది సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు పీజీ కోర్సుల్లో 620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 496 రెగ్యులర్, 124 సెల్స్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. తొమ్మిది సైన్స్ కోర్సుల్లో 230 సీట్లు ఉండగా, వీటిలో రెగ్యులర్ 184 సీట్లు, 46 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి. పది ఆర్ట్స్ కోర్సుల్లో 390 సీట్లలో వీటిలో 312 రెగ్యులర్, 78 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు www.braudoa.inను సంప్రదించాలి.

ప్రధాన అంశాలు..

దరఖాస్తుల స్వీకరణకు గడువు : జూన్ 30
ప్రవేశ పరీక్ష తేదీలు : జూలై 15, 16, 17, 18
పరీక్షఫీజు : ఓసీ, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.300.

పరీక్ష నిర్వహించే ప్రాంతాలు :
శ్రీకాకుళం, పలాస, బొబ్బిలి, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి
Published by: Narsimha Badhini
First published: May 31, 2020, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading