Home /News /jobs /

JP MORGAN INVITES APPLICATIONS J2EE DEVELOPER SSOCIATE FOR HYDERABAD KNOW APPLICATION PROCESS GH EVK

JP Morgan Jobs: జేపీ మోర్గాన్ హైదరాబాద్ బ్రాంచ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

జేపీ మోర్గాన్‌లో ఉద్యోగాలు

జేపీ మోర్గాన్‌లో ఉద్యోగాలు

మల్టీనేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ JP మోర్గాన్ చేజ్ (JP Morgan Chase) కొత్త నియామకాలకు శ్రీకారం చుట్టింది. తమ హైదరాబాద్ ఆఫీస్‌లో పనిచేయడానికి జావా J2EE డెవలపర్ అసోసియేట్ (Java J2EE Developer Associate) కోసం సంస్థ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
మల్టీనేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ JP మోర్గాన్ చేజ్ (JP Morgan Chase) కొత్త నియామకాలకు శ్రీకారం చుట్టింది. తమ హైదరాబాద్ (Hyderabad) ఆఫీస్‌లో పనిచేయడానికి జావా J2EE డెవలపర్ అసోసియేట్ (Java J2EE Developer Associate) కోసం సంస్థ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా జావా డిజైన్ పాటర్న్స్, కోర్ జావా 5.0+, మల్టీథ్రెడింగ్, అజాక్స్ అండ్ రియాక్ట్‌జెస్ వంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఈ ఫుల్-టైమ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021. ఈ ఉద్యోగానికి దరఖాస్తులను పంపాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jpmc.fa.oraclecloud.com ద్వారా అప్లై చేసుకోవచ్చు.

అర్హతల వివ‌రాలు..
- ఈ పోస్టుకు అప్లికేషన్ పంపే అభ్యర్థులకు కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలని జాబ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Indian Navy Jobs: ఇండియ‌న్ నేవీలో 275 అప్రెంటీస్‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం


- ప్రైమరీ స్కిల్స్‌ (Primary Skills)గా జావా డిజైన్ పాటర్న్స్, కోర్ జావా 5.0+, మల్టీథ్రెడింగ్, అజాక్స్, రియాక్ట్‌జెస్, స్ప్రింగ్, హైబర్నేట్ ఫ్రేమ్‌వర్క్, ఐబాటిస్, వెబ్ సర్వీసెస్ ఆన్ జావా, OOP కాన్సెప్ట్‌లు, టెక్ ఎనాలిసిస్/డిజైన్/డాక్యుమెంటేషన్, SDLC, ఎజైల్ మెథడాలజీస్‌ వంటి అర్హతలతో పాటు అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

- సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగానికి ఒరాకిల్ PL/SQL డెవలప్‌మెంట్, యునిక్స్ షెల్/పెర్ల్ స్క్రిప్టింగ్, GIT సాఫ్ట్‌వేర్ వెర్షన్ కంట్రోల్, JIRA ఎక్స్‌పోజర్, JSP- J2EE డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్, సర్వ్‌లెట్‌.. వంటి సెంకడరీ స్కిల్స్ అర్హతలుగా ఉండాలి.

పని విధానం..
ఉద్యోగానికి ఎంపికైన వారు అప్లికేషన్ డెవలప్‌మెంట్ టీమ్ లీడ్ (Development Team Lead), బిజినెస్ ఎనలిస్ట్‌లు, ఇతర షేర్‌హోల్డర్ల అవసరాలను అర్థం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది.

IndiGo Airlines: ఇండిగో ఎయిర్​లైన్స్‌లో ట్రైనీ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్‌కు అవ‌కాశం


సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం J2EE డెవలపర్ అసోసియేట్ నిర్వర్తించాల్సిన మరో ప్రధాన బాధ్యత. దీంతో పాటు అభ్యర్థులు ప్రాజెక్ట్ డెలివరీ ఫ్రేమ్‌వర్క్, ఇంటర్నల్ సిస్టమ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్, ప్రమాణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

విప్రోలో కూడా.. ఉద్యోగాలు
విప్రో కూడా గుర్గావ్ బ్రాంచ్‌లో పనిచేసేందుకు సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ కోసం నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థికి కనీసం 2-4 సంవత్సరాల పని అనుభవం (Experience) ఉండాలి. దీంతోపాటు జావా/J2EE, యాంగ్యులర్ 8, స్ప్రింగ్ బూట్, హైబర్నేట్, SQL/ ఒరాకిల్ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులు కంపెనీ ఆదేశించే షిఫ్ట్‌లలో పని చేయగలగాలి. టెక్నికల్ సమస్యల పరిష్కారానికి కొన్నిసార్లు వారాంతాల్లో కూడా అందుబాటులో ఉండాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Published by:Sharath Chandra
First published:

Tags: Hyderabad, IT jobs, JOBS, Private Jobs, Wipro

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు