హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

ఆల్ ఇండియా 270 ర్యాంకర్‌కు బ్యాడ్ లక్... ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీలో సీటు పోయింది

ఆల్ ఇండియా 270 ర్యాంకర్‌కు బ్యాడ్ లక్... ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీలో సీటు పోయింది

ఆల్ ఇండియా 270 ర్యాంకర్‌కు బ్యాడ్ లక్... ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీలో సీటు పోయింది
(ప్రతీకాత్మక చిత్రం)

ఆల్ ఇండియా 270 ర్యాంకర్‌కు బ్యాడ్ లక్... ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీలో సీటు పోయింది (ప్రతీకాత్మక చిత్రం)

ఐఐటీలో సీటు రావడమంటే చాలా కష్టపడాలి. ఎంట్రెన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంక్ సాధించాలి. అలా మంచి ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థి తనకు వచ్చిన సీటును ఎలా కోల్పోయాడో తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే.

  అతని పేరు సిద్దాంత్ బాత్రా. వయస్సు 18 ఏళ్లు. ఆగ్రావాసి. అతను చదువులో మంచి టాలెంట్ ఉన్నవాడు. తండ్రి లేకపోయినా తల్లి బాగా చదివించింది. పాపం రెండేళ్ల క్రితం తల్లి కూడా చనిపోయింది. దీంతో అతను అనాథగా మారిపోయాడు. అయినా కష్టపడి చదివాడు. ఐఐటీలో సీటు సంపాదించాలనుకున్నాడు. ఇటీవల నిర్వహించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-JEE లో ఆ విద్యార్థి 270 ర్యాంక్ సాధించాడు. తను కోరుకున్నట్టే అక్టోబర్ 18న ఐఐటీ బాంబేలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు వచ్చింది. సంతోషానికి అవధుల్లేవు. ఐఐటీలో చదువు పూర్తి చేసి తన కెరీర్ చక్కగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాడు. కానీ ఇంతలో ఊహించని షాక్. కొద్ది రోజుల క్రితం తనకు వచ్చిన సీటు పోయింది. అక్టోబర్ 18న లిస్ట్‌లో ఉన్న తన పేరు నవంబర్ 10న చెక్ చేస్తే కనిపించలేదు. అంతే. షాకయ్యాడు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

  Indian Air Force Jobs: ఇంటర్ అర్హతతో జాబ్స్... దరఖాస్తు గడువు పెంచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌

  విద్యార్థులకు అలర్ట్... CBSE, NEET, JEE Main 2021 పరీక్షలపై ముఖ్యమైన అప్‌డేట్

  సిద్దాంత్ బాత్రాకు ఐఐటీ బాంబేలో వచ్చిన సీటు పోవడానికి కారణం ఒక్క రాంగ్ క్లిక్. అవును... అఫీషియల్ సైట్‌లో లాగిన్ అయిన తర్వాత తన వివరాలు చెక్ చేసుకునేప్పుడు రాంగ్ క్లిక్ చేయడంతో సీటు పోయింది. అక్టోబర్ 31న ‘withdraw from seat allocation and further rounds’ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాడు. అంతే... తనకు కేటాయించిన సీటు విత్‌డ్రా అయిపోయింది. తనకు సీటు కేటాయించారు కాబట్టి తదుపరి రౌండ్స్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేశాడు. కానీ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా తనకు వచ్చిన సీటు పోయింది. తర్వాతి రౌండ్లలో పాల్గొనే అవకాశం కూడా పోయింది. బీటెక్ కోర్సు జాబితాలో తన పేరు లేదన్న విషయాన్ని నవంబర్ 10న గుర్తించాడు. తాను 'అనుకోకుండా, తెలియకుండా' పొరపాటు చేశానని తన సీటు తనకు కేటాయించాలంటే బాంబే హైకోర్టును ఆశ్రయించాడు ఆ విద్యార్థి.

  Coast Guard Jobs 2020: టెన్త్ అర్హతతో కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

  SBI Jobs 2020: తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు... జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

  నవంబర్ 23న సిద్దాంత్ బాత్రా దాఖలు చేసిన అభ్యర్థనపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆ విద్యార్థి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని ఐఐటీ బాంబేకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందే ఐఐటీ బాంబే బాత్రా అభ్యర్థనను తిరస్కరించింది. విత్‌డ్రా లెటర్‌ను చెల్లదని చెప్పే అధికారం తమకు లేదని, జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ చేతిలో ఉంటుందని ఐఐటీ బాంబే తెలిపింది. ఇప్పుడు తమ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు ఖాళీ లేదు కాబట్టి ఆ విద్యార్థి వచ్చే ఏడాది దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో సదరు విద్యార్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, EDUCATION, IIT, IIT Bombay, Jee, JEE Main 2020

  ఉత్తమ కథలు