దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, టెక్నికల్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2021 బ్రోచర్ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ జేఈఈ మెయిన్స్ రాసి, అడ్వాన్స్డ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఎలాంటి ఊరట నిచ్చారు... మహిళల కోటాపై ఏం చేయనున్నారు.. బోర్డు ఎగ్జామ్స్‌లో ఎంత శాతం వస్తే జేఈఈ పరీక్షలు రాయడానికి అర్హులు అనే అంశాలపై తాజా సమాచారాన్ని ఈ బ్రోచర్లో పొందుపరిచారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసిన ఈ బ్రోచర్లో.. ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తెలియజేయలేదు. కానీ కిందటేడాది (2020) మెయిన్స్ పాసైన అభ్యర్థులకు ఈ ఏడాది అడ్వాన్స్డ్ (2021) పరీక్షలు రాయడానికి అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఇలా మెయిన్ పరీక్షలను క్యారీఫార్వర్డ్ చేయడానికి జేఈఈ పరీక్షలలో చోటు లేదు. అయితే కోవిడ్ కారణంగా 2020లో మెయిన్స్ పాసైన కొంతమంది, అడ్వాన్స్డ్ పరీక్షలు రాయలేకపోయారు. దీంతీ తమకు మరో అవకాశం కల్పించాలని వీరు డిమాండ్ చేశారు. ఫలితంగా వీరికి 2021లో మెయిన్స్ రాయకుండానే అడ్వాన్స్డ్ పరీక్షలు రాయడానికి అనుమతిస్తున్నట్టు బ్రోచర్లో పేర్కొన్నారు.
TS Inter 2nd Year Results 2021: మీ రిజల్ట్ రాలేదా? మార్కులు తక్కువగా వచ్చాయా? ఇలా కంప్లైంట్ చేయండి
TS Inter Results 2021: ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే
అయితే దీనివల్ల అడ్వాన్స్డ్ పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య, కళాశాలలో సీట్లకు ఎక్కువ పోటీ ఏర్పడకుండా, ఈ బ్యాచ్‌ను అదనంగా పరిగణించనున్నారు. అంటే 2020లో జేఈఈ మెయిన్స్ రాసి పాసైన అభ్యర్థులు 2021లో అడ్వాన్స్డ్ రాసి పాసైనప్పటికీ వీరిని 2020 బ్యాచ్‌గానే గుర్తిస్తారు. ఆ ఏడాదికి సంబంధించిన సీట్లను వీరికి కేటాయిస్తారు. అంటే దీని వల్ల ఎటువంటి అదనపు పోటీ ఏర్పడదన్నమాట.
ఐఐటీల్లో విద్యార్థినులకు కిందటేడాది 20శాతం కోటా కేటాయించగా, ఈ ఏడాది ఆయా ఐఐటీలు సొంతంగా విద్యార్థినుల కోటా ను నిర్ణయించనున్నాయి. అయితే విద్యార్థినుల కోటాను ప్రస్తుతమున్న కోటాకు అదనంగా కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక కళాశాలలో వంద సీట్లు ఉంటే ఐదుశాతం మహిళలకు రిజర్వ్ చేసి.. 105 సీట్లుగా లెక్కిస్తారు. ఐఐటీలలో విద్యార్థినుల సంఖ్యను పెంచడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
IBPS RRB 2021: బ్యాంకుల్లో 12,958 జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి
దీని వల్ల ఓపెన్ ర్యాంక్‌లో సీటు సాధించుకున్నవారితోపాటు ఈ అదనపు సృష్టి ద్వారా నిర్ణీత ర్యాంకు కన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థినులూ లబ్ధి పొందుతారు. 2019లో ఐఐటీల్లో 17శాతం ఉమెన్ కోటా కేటాయించగా, 2018లో 14శాతం కేటాయించాయి.
2021 బ్యాచ్‌కు సంబంధించి ప్రతి ఐఐటీలో కనీసం 20శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు షెడ్యూల్డ్ కాస్ట్‌కు 15 శాతం షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు 7.5 శాతం, దివ్యాంగులకు 5శాతం సీట్లను ఐఐటీల్లో రిజర్వ్ చేశారు. ఈ సంస్థలలో ఈడబ్ల్యుఎస్ కోటా, ఫారిన్ కోటా కూడా ఉన్నాయి. అయితే ఇవి మహిళా కోటా మాదిరే ఉన్న సీట్లకు అదనంగా ఏర్పాటు చేస్తారు.
జెఈఈ మెయిన్ పరీక్షలు జులైలోగానీ, ఆగస్టులోగానీ జరుగుతాయని భావిస్తుండగా, జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు సెప్టెంబర్ కంటే ముందే జరుగుతాయంటున్నారు. ఈ సారి కూడా కిందటేడాదిలానే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతను మాత్రమే ప్రామాణికతగా తీసుకుంటున్నారు. అంటే ఇంటర్ కేవలం పాస్ అయితే చాలు... అంతకుముందు ఇంటర్మీడియట్లో కనీసం 75శాతం మార్కులు వచ్చినవారు మాత్రమే జేఈఈ పరీక్షలు రాయడానికి అర్హులు. కిందటేడాది విద్యామంత్రిత్వశాఖ ఈ నియమాన్ని సడలించి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అనే నిబంధన విధించింది. ఈ ఏడాది కూడా ఇదే నిబంధనను పాటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, IIT, IIT Bombay, IIT Hyderabad, IIT Madras, Jee, JEE Main 2021