హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Investments: తెలంగాణలో ప్రముఖ జాకీ సంస్థ పెట్టుబడులు.. 7 వేల మందికి ఉద్యోగాలు.. ఆ జిల్లాల్లో ఏర్పాటు

Telangana Investments: తెలంగాణలో ప్రముఖ జాకీ సంస్థ పెట్టుబడులు.. 7 వేల మందికి ఉద్యోగాలు.. ఆ జిల్లాల్లో ఏర్పాటు

మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు

మంత్రి కేటీఆర్ తో సంస్థ ప్రతినిధులు

తాజాగా ప్రముఖ లోదుస్తుల తయారీ సంస్థ జాకీ (పేజ్ ఇండస్ట్రీస్) ఇబ్రహీంపట్నం, ములుగులో తమ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఒక కోటి వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో పెట్టుబడుల (Telangana Investments) రాక జోరుగా సాగుతోంది. ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) చొరవతో అనేక కంపెనీలు రాష్ట్రంలో పట్టుబడులు పెట్టడానికి ముందు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ లోదుస్తుల తయారీ సంస్థ జాకీ (Jockey-పేజ్ ఇండస్ట్రీస్) ఇబ్రహీంపట్నం, ములుగులో తమ కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఒక కోటి వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా దాదాపు 7000 ఉద్యోగాలను (Jobs) ఈ సంస్థ కల్పించనుంది. పేజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్, సంస్థ సీనియర్ ప్రతినిధి బృందం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ తో ఈ రోజు సమావేశమయ్యారు. సమావేశంలో తమ పెట్టుబడి ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కు వారు వివరించారు. ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో సుమారు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తమ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది.

ఈ యూనిట్ ద్వారా మొత్తం 3000 మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇంకా.. సిద్దిపేట జిల్లాలోని ములుగులో 25 ఎకరాల విస్తీర్ణంలో భారీ తయారీ యూనిట్ ను కూడా పేజ్ ఇండస్ట్రీస్ నిర్మించనుంది. ఈ యూనిట్ ద్వారా మరో 4000 మంది స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గణేశ్ మాట్లాడుతూ.. పేజ్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఒమన్, ఖతార్, మాల్దీవ్స్ ,భూటాన్, యూఏఈ తదితర దేశాల్లో జాకీ ఉత్పత్తులను విక్రయిస్తూ.. ప్రముఖ గార్మెంట్స్ తయారీ సంస్థగా నిలించిందదన్నారు.

UK Visas: ఇండియన్స్‌కు ప్రతి సంవత్సరం మూడువేల UK వీసాలు.. కొత్త స్కీమ్‌కు రిషి సునక్ గ్రీన్‌సిగ్నల్

తమ కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారానికి అనుకూల వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. భారతదేశంలో మరింత పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరించేందుకు భౌగోళికంగా అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని తెలిపారు. తమకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.

పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కంపెనీ మరింతగా అభివృద్ధి చెందుతుని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేజ్ ఇండస్ట్రీస్ రూ.290 కోట్ల పెట్టుబడితో సుమారు 7000 మంది స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

First published:

Tags: Investments, JOBS, KTR

ఉత్తమ కథలు