సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేయాలంటే ముందుగా మన రెజ్యూమ్ సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీలకు మన రెజ్యూమ్ నచ్చితే.. ఇంటర్వ్యూలకు పిలుస్తాయి. లేదంటే ఆదిలోనే ఉద్యోగావకాశం కోల్పోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ స్థాయికి రావాలంటే.. రెజ్యూమ్ లేదా సీవీని చాలా చక్కగా సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మనం అప్లై చేస్తున్న ఉద్యోగానికి అనుగుణంగా మన నైపుణ్యాలను పొందుపరచాలి. అప్పుడే ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ప్రస్తుతం కరోనా దెబ్బకు చాలామంది ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. నిరుద్యోగుల రెజ్యూమ్స్ అనేక కంపెనీల మీద కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఇటువంటి సమయంలో సీవీని ఎంత బాగా సిద్ధం చేయాలో మీరే ఊహించండి. అయితే ఒక నిరుద్యోగి మాత్రం తన రెజ్యూమ్ లో "గూగులింగ్" ని తనలోని ఒక నైపుణ్యంగా పేర్కొన్నాడు. గూగులింగ్ అంటే.. ఒక వ్యక్తి గురించి లేదా ఒక టాపిక్ గురించి గూగుల్ సెర్చ్ ఇంజన్ లో శోధించడం.
Chief Puppy Officer: కుక్కతో ఆడుకుంటే నెలకు రూ.2,00,000 జీతం
SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే
అయితే అతడి రెజ్యూమ్ ని పరిశీలించిన ఓ కంపెనీ హైరింగ్ టీమ్ సభ్యులు మంత్రముగ్ధులయ్యారు. వెంటనే అతన్ని ఇంటర్వ్యూకి రావలసిందిగా కోరారు. ఈ విషయాన్ని హైరింగ్ టీమ్ సభ్యులలో ఒకరైన క్యాట్ మెక్‌గీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "ఈరోజు ఒక సీవీ వచ్చింది. అందులో దరఖాస్తుదారుడు 'గూగులింగ్' ని స్కిల్‌గా పేర్కొన్నాడు" అని ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిజానికి ఇలాంటి స్కిల్స్ ని సీవీలో పేర్కొంటే ఎవరూ కూడా ఇంటర్వ్యూలకు పిలవరు. కానీ క్యాట్ మెక్‌గీ హైరింగ్ టీమ్ మాత్రం సదరు నిరుద్యోగిని ఇంటర్వ్యూకి పిలిచింది. ఈ విషయాన్ని క్యాట్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. "మేము అతన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం" అని ఆమె తెలిపారు.
Got a CV today and the guy literally listed one of his skills as ‘googling’
We’re interviewing him
— Cat McGee (@CatMcGeeCode) July 23, 2021
అయితే ఆమె ట్విట్టర్ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ ట్వీట్ కి 1 లక్షా 84 వేలకు పైగా లైకులు వచ్చాయి. 13 వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి.
Constable Jobs: టెన్త్ పాసయ్యారా? 25,271 కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయండి ఇలా
UPSC Recruitment 2021: కేంద్ర హోమ్ శాఖలో ఉద్యోగాలు... రూ.1,50,000 వరకు జీతం
చాలామంది క్యాట్ మెక్‌గీ హైరింగ్ టీమ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గూగుల్ చేయడం కూడా ఒక మంచి స్కిల్ అని.. కానీ దానిని మీలాగా ఎవరూ గుర్తించరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గూగుల్ లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కచ్చితమైన కీవర్డ్స్ ఎలా ఉపయోగించాలో తెలియాలి. సరైన పదబంధాలను ఉపయోగించకపోతే గూగుల్ సెర్చ్ అనేది నిరుపయోగం. చాలామందికి సరిగ్గా గూగుల్ సెర్చ్ చేయటమే రాదు. కాబట్టి గూగుల్ లో సరైన సమాచారాన్ని కనుగొని వాస్తవాన్ని తెలుసుకోగలిగే సామర్థ్యం కూడా ఓ స్కిల్లే. ఇదే విషయాన్ని చాలా మంది నెటిజన్లు నొక్కి మరీ చెబుతున్నారు. ఏది ఏమైనా, నిరుద్యోగులు తమకు ఏ విషయంలో బాగా నైపుణ్యం ఉందో దాన్ని నిస్సందేహంగా రెజ్యూమ్ లో పేర్కొంటే.. ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశాలు రావచ్చని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Trend, Trending news, Upcoming jobs, VIRAL NEWS, Viral on internet, Viral post, Viral tweet