హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి నేడు భారీ జాబ్ మేళా.. వివరాలివే

Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి నేడు భారీ జాబ్ మేళా.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

APSSDC Jobs: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 107 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

  నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 107 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. శ్రీ రాఘవ డవలపర్స్&బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ జియో లిమిటెడ్, Team Lease తదితర కంపెనీల్లో ఉద్యోగాల నియామకాలకు ఈ నెల 22న కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని Dr.Zakir Hussain College Of Arts&Science లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటల కల్లా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  ఖాళీలు, అర్హతల వివరాలు..

  Sri Raghava Developers&Builders Private Limited: కంపెనీలో టెలీ కాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్, టీమ్ లీడర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. టీమ్ లీడర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి ఏదైనా రంగంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి. టెలీ కాలర్ విభాగంలో మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ అందిస్తారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఇస్తారు. టీమ్ లీడర్ విభాగంలో 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 25 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ అందిస్తారు.

  Reliance Jio Limited: ఈ ప్రముఖ సంస్థలో Commerce Service Officer విభాగంలో 25 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 9500 వేతనంతో పాటు మార్కెట్ విసిట్ చేసినందుకు రోజుకు రూ. 100 ఇస్తారు. నెలకు రూ.200 ఫోన్ బిల్లు సైతం అందిస్తారు.

  Team Lease: ఈ కంపెనీలో Branch Relationship Executive, Branch Relationship Manager విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొదటి విభాగంలోని పోస్టులకు ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 14 వేల వరకు వేతనం ఉంటుంది. బ్రాంచ్ రిలేషన్ షిప్ మేనేజర్ విభాగంలో మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి, అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం వివరాలు పేర్కొనలేదు.

  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఏదైనా సందేహాలుంటే 8919951682, 9603368324 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, కొండపల్లి, వత్సవాయి, వీరుళ్లపాడు, గుంటుపల్లి, నూజివీడు, భవానీపురం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, అవనిగడ్డ, గుడివాడ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది.

  Registration Direct Link

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, JOBS, Reliance Jio

  ఉత్తమ కథలు