• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JOBS RECRUITMENT IN RELIANCE RETAIL AT KRISHNA GUNTUR CRDA REGION THROUGH APSSDC HERE DETAILS NS

APSSDC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థలో ఇంటర్ అర్హతతో 200 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

APSSDC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థలో ఇంటర్ అర్హతతో 200 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో శుభవార్త చెప్పింది. గుంటూరు, సీఆర్డీఏ రీజియన్, కృష్ణా జిల్లాల్లోని Reliance Retailలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) తాజాగా మరో శుభవార్త చెప్పింది. గుంటూరు, సీఆర్డీఏ రీజియన్, కృష్ణా జిల్లాల్లోని Reliance Retailలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు సీఆర్డీఏ రీజియన్లలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

    విద్యార్హతల వివరాలు..
    కామర్స్ సేల్స్ ఆఫీసర్ విభాగంలో ఈ 200 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 22-30 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు 2 వీలర్ తో పాటు, స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13, 500 వేతనంతో పాటు పనితీరు ఆధారంగా రూ. 6 వేల వరకు ఇన్సెంటీవ్స్ ఇస్తారు.
    Registration-Direct Link



    రిజిస్ట్రేషన్..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు ఈ ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. గుంటూరు-9160031006, CRDA Region: 8008742842, కృష్ణా-9666654641.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు