JOBS RECRUITMENT IN MNC MOBILE COMPANY THROUGH APSSDC SRI CITY AP NS
APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. శ్రీ సిటీలోని MNC Mobile Companyలో ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. శ్రీ సిటీలోని MNC Mobile Companyలో ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 5లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది. టెక్నికల్, హెచ్ ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ విభాగాల్లో బీటెక్ చేసిన వారు రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. 2018, 2019, 2020లో పాసైన వారు రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13 వేల వేతనం అందించనున్నారు. అభ్యర్థులకు రాయితీపై ఆహరం, వసతి కల్పిస్తారు. Registration-Direct Link
రిజిస్ట్రేషన్ ఇలా..
ఎంపికైన అభ్యర్థులు మొదట ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ASSDC&MNC Mobile Companyల ఆధ్వర్యంలో వారం పాటు శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కంపెనీలో ఉద్యోగం కల్పించబడుతుంది. ఇతర వివరాలకు 938126558, 8790813132 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు. బ్యాచ్ మార్చి 8న ప్రారంభం అవుతుంది.