• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JOBS RECRUITMENT IN KYUNGSHIN INDUSTRIAL MOTHERSON PVT LTD HINDUPURAM ANANTAPUR DISTRICT THROUGH APSSDC HERE FULL DETAILS NS

APSSDC Jobs: ఆ ప్రముఖ కంపెనీలో 280 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. వివరాలివే

APSSDC Jobs: ఆ ప్రముఖ కంపెనీలో 280 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Kyungshin Industrial Motherson Pvt Ltdలో ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. Kyungshin Industrial Motherson Pvt Ltdలో ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 280 ఖాళీల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 11లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లా, హిందూపూర్ లోని సంస్థ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రవాణా సౌకర్యంతో పాటు, ఉచిత భోజన సదుపాయం అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ ప్రకటన ద్వారా అసోసియేట్ స్పెషల్ ట్రైనీలు, డిప్లొమో, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందుకు సంబంధించిన విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
    Associates Special Trainees: ఈ విభాగంలో మొత్తం 200 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్థ కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. వయస్సు 18-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 8,800 వరకు వేతనం చెల్లించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Diploma(Operator&Engineer): ఈ విభాగంలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమో చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ విభాగంలో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.


    Graduate Engg(Operaor&Engineer): ఈ విభాగంలో 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ విభాగాల్లో బీ.టెక్ చేసిన వారు అప్లై చేయడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11,500 వరకు వేతనం చెల్లించనున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Registration-Direct Link

    ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
    -అభ్యర్థులు మొదటగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్(DSO) ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
    -ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు.
    -విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగం కల్పించబడుతుంది.
    -అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 7981222035, 9398214443 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు