• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JOBS RECRUITMENT IN KRISHNA DISTRICT COOPERATIVE CENTRAL BANK HERE VACANCIES DETAILS NS

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో మూడు రోజులే గడువు

Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో మూడు రోజులే గడువు

ప్రతీకాత్మక చిత్రం

Krishna District Cooperative Central Bank Jobs: నిరుద్యోగులకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్లు, స్టాఫ్ అసిస్టెంట్(క్లర్కులు) ఉద్యోగాల భర్తీకి బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిరుద్యోగులకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్లు, స్టాఫ్ అసిస్టెంట్(క్లర్కులు) ఉద్యోగాల భర్తీకి బ్యాంకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు బ్యాంకు ప్రకటించింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు. అసిస్టెంట్ మేనేజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ. 33 వేలు, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.24 వేల వేతనం ఉంటుంది. పోస్టుల వారీగా ఖాళీలు, వాటి విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

    అసిస్టెంట్ మేనేజర్లు: ఈ విభాగంలో మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటిలో 9 పోస్టులను మహిళలకు కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. ఇంగ్లిష్, తెలుగు భాషలపై అవగాహన కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 100 మార్కులకు ఆన్ లైన్ టెస్ట్, 12.5 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లిష్ భాషపై ఆన్ లైన్ టెస్ట్ ఉంటుంది. తప్పు సమాధానాలకు నెగటీవ్ మార్కులు ఉంటాయి. ఈ రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు.

    స్టాఫ్ అసిస్టెంట్లు: ఈ విభాగంలో మొత్తం 72 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 26 పోస్టులను మహిళలకు కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పని చేసే సిబ్బందికి 18 పోస్టులు కేటాయించారు. వీటిలో 8 మహిళలకు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా కోర్సులో డిగ్రీ చేసి ఉండాలి. ఇంగ్లిష్ తెలుగు భాషలపై అవగాహన ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులను ఆన్ లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.krishnadccb.com వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, అగిరిపల్లి, మైలవరం, పెడనలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కేవలం స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు