HOME »NEWS »JOBS & EDUCATION »jobs recruitment in k technologies guntur through apssdc ns

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో ఉద్యోగాలు.. వివరాలివే..

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో ఉద్యోగాలు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజా సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. తాజాగా APSSDC నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. K Technologiesలో 20 ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ను అందిస్తారు.

    ఖాళీలు, అర్హతల వివరాలు..


    సేల్స్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ, బీటెక్, ఎంబీఏ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు గుంటూరులో పని చేయాల్సి ఉంటుంది.



    ఎలా అప్లై చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టెక్నికల్, హెచ్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
    Registration-Direct Link
    Published by:Nikhil Kumar S
    First published:February 23, 2021, 14:10 IST