Home /News /jobs /

JOBS RECRUITMENT IN HETERO DRUGS HYDERABAD THROUGH APSSDC HERE FULL DETAILS NS

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిరుద్యోగుల కోసం వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిరుద్యోగుల కోసం వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

    ఖాళీలు, విద్యార్హతలు..
    ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయున్నారు. ఇందులో ప్రొడక్షన్ విభాగంలో 100, QA/QC/R&D విభాగంలో 50, ఇంజనీరింగ్ విభాగంలో మరో 50 ఖాళీలు ఉన్నాయి.
    -ప్రొడక్షన్ విభాగంలోని ఉద్యోగాలకు బీఎస్సీ, బీకామ్, బీఏ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. 2016-2020 మధ్యలో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ. 11 వేల వరకు అందించనున్నారు.

    -QA/QC/R&D డిపార్ట్మెంట్లో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎమ్మెస్సీ(అనలైటికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ) విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 2016-2020 సంవత్సరాల్లో పాసైన వారు అర్హులు. 18-28 ఏళ్ల వయస్సు కలిగిన ఉండాలి. ఈ విభాగంలో ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.8 లక్షల వేతనం అందించనున్నారు.
    -ఇంజనీరింగ్ విభాగంలో మరో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ(ఫిట్టర్) విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 2016-2020 మధ్య పాసై ఉండాలి. వయస్సు 18-20 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల వేతనం చెల్లించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలని స్పష్టం చేశారు.
    -ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం ఉంటుంది. దీంతో పాటు ఇంకా వివిధ అలవెన్స్ లు ఉంటాయి. ఇంకా వార్షిక బోనస్ రూ.16,800 ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్(Kazipalli, Bonthapalli, choutuppal)లో పని చేయాల్సి ఉంటుంది.



    ఇంటర్వ్యూ వివరాలు..
    అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు శ్రీ హర్షిణి డిగ్రీ కాలేజ్, లాయర్ పేట, ఎన్.హెచ్-5, ఒంగోలు చిరునామాలో ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజర్యే సమయంలో అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోలు, Resume జిరాక్స్ కాపీలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, CAREER, Govt Jobs 2021, Hyderabad, JOBS, Ongole

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు