• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JOBS RECRUITMENT IN HDFC LIFE INSURANCE COMPANY LIMITED ANANTHAPUR AP THROUGH APSSDC NS

APSSDC Jobs: డిగ్రీ అర్హతతో HDFC Life insuranceలో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. వివరాలివే

APSSDC Jobs: డిగ్రీ అర్హతతో HDFC Life insuranceలో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ HDFC Life insurance Company Limitedలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ HDFC Life insurance Company Limitedలో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26 న అనంతపురంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురంలో పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    HDFC Life insurance company limitedలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. FC&FCCP(Financial Consultant&Financial Consultant Program) విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైన సబ్జెక్టుల్లో డిగ్రీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి రూ.12 నుంచి రూ. 14 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ సైతం అందించనున్నారు. అభ్యర్థుల వయస్సు 25-35 మధ్య ఉండాలి.



    రిజిస్ట్రేషన్..
    అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్లో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26న ఉదయం 9 గంటలకు HDFC Life insurance Company Limited, ground floor, d.no. 15/322, nithin complex, vinayak chowk, sapthagiri sircle, anantapur-515001 చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర ఏమైనా సందేహాలుంటే 9550855080, 9885943819 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు