హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. నేడు ఆ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. నేడు ఆ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఆర్డీఏ(CRDA) పరిధిలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది.

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఆర్డీఏ(CRDA) పరిధిలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. Best Price(Walmart) లో 40 ఖాళీల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 15న నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  అర్హతల వివరాలు..

  టీమ్ లీడర్స్, TRE/FOS విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. టీమ్ లీడర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎంపికైన వారికి రూ. 20 వేల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐసీ, రూ. 5 వేల వరకు ఇన్సెంటీవ్స్+పెట్రోల్ కు రూ. 2500 వరకు చెల్లించనున్నారు. TRE/FOS పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్/ఇంటర్/డిగ్రీ చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 11 వేల వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐసీ, రూ.2500 వరకు ఇన్సెంటీవ్స్, పెట్రోల్ ఖర్చుల కింద రూ.2500 చెల్లించనున్నారు.

  -ఈ రెండు పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ఎంఎస్ ఆఫీస్ తో పాటు, ఇంగ్లిష్, హింది లాంగ్వేజ్ పై అవగాహన ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నిజామాబాద్, వరంగల్, కర్నూల్ తదితర ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు Best Price(Walmart), Opp Delhi Public School, 125/1, Nidamanuru, Vijayawada చిరునామాలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రకటనలో సూచించారు. ఇతర ఏదైనా సందేహాలుంటే 8008742843, 8919951682 నంబర్లను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

  First published:

  Tags: Crda, Govt Jobs 2021, Guntur, JOBS, Nizamabad, Vijayawada, Warangal

  ఉత్తమ కథలు