Jobs : జాబ్స్‌కి అప్లై చేశారా.. ఇలా ప్రిపేర్ అవ్వండి..

ఈ మధ్యకాలంలో అటూ కేంద్ర, ఇటూరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఎన్నో వెలువడ్డాయి. మరి వీటికి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది.. మీకోసం ఇక్కడ కొన్ని టిప్స్..

Amala Ravula | news18-telugu
Updated: April 10, 2019, 10:45 AM IST
Jobs : జాబ్స్‌కి అప్లై చేశారా.. ఇలా ప్రిపేర్ అవ్వండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 10, 2019, 10:45 AM IST
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రిపేర్ అయ్యేవారు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి.. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించాలి. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌తో పోల్చితే ఈ విభాగంలో తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. అందుకే కరెంట్ అఫైర్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దీనికోసం రోజూ తప్పనిసరిగా న్యూస్‌పేపర్స్ చదవాలి. అయితే, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి పరీక్షకి ఓ 2 నెలల ముందునుంచి చూస్తే సరిపోతుంది.
అదే విధంగా.. ప్రభుత్వాల తాజా విధాన పర నిర్ణయాలు గురించితెలుసుకోవాలి.. వీటికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతుంటాయి. అందులోని సారాంశమే కాకుండా రచయితల పేర్లు గుర్తుంచుకోవాలి. చరిత్రకు సంబంధించిన విషయాలు, భారతదేశ చరిత్ర స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకోవాలి. వీటితో పాటు.. ప్రాథమిక హక్కులు తెలుసుకోవాలి. భారత రాజ్యాంగ చరిత్ర, ప్రవేశిక, రాజ్యాంగ నిర్మాణంలో అంశాలపై పట్టు సాధించాలి.
జాగ్రఫిలో నేలలు రకాలు, జనాభా గణన, వాతావరణ పొరలు ఇలాంటి తెలుసుకోవాలి. వీటితో పాటు.. జిడిప, జిఎన్‌పి, ఎన్ఎన్‌పి, ద్రవ్యోల్బణం, బడ్జెట్ ప్రక్రియ, ఆర్‌ఆర్‌బి విధానాలు వంటివి తెలుసుకోవాలి. వీటితో పాటు కేంద్ర ప్రణాళికలు ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళిక, నీతి ఆయోగ్ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలి.

మ్యాథ్స్‌లో కూడికల, తీసివేతలు, గుణాంకాలు, భాగహారంతో పాటు శాతాలు, లాభనష్టాలు, కాలం పని, క్యాలెండర్స్, లాజికల్ రీజనింగ్, డైరెక్షన్స్, క్యాలెండర్స్ గురించి తెలుసుకోవాలి.
వీటితో పాటు ప్రతీరోజూ కొత్త సబ్జెక్ట్‌ గురించి తెలుసుకుంటూ ఓ ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాన్ని సులభంగా సంపాదించొచ్చు.. ఆల్‌ ది బెస్ట్..

First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...