హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Wipro: విప్రో హైద‌రాబాద్‌లో ఉద్యోగ అవ‌కాశాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

Jobs in Wipro: విప్రో హైద‌రాబాద్‌లో ఉద్యోగ అవ‌కాశాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wipro Jobs | దేశంలో ప్ర‌ముఖ ఐటీ కంపెనీ దిగ్గ‌జం విప్రో (Wipro)ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. Account Executive - Banking & Financial Services విభాగంలో పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది.

దేశంలో ప్ర‌ముఖ ఐటీ కంపెనీ దిగ్గ‌జం విప్రో (Wipro)ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. Account Executive - Banking & Financial Services విభాగంలో పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ విభాగంలో ఎంపికైన అభ్య‌ర్థులు క్ల‌యింట్ సంబంధిత విధుల‌ను నిర్వ‌హించాల్సి ఉంది. ఈ ఉద్యోగాలు హైద‌రాబాద్ లోకేష‌న్‌లో ఉంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ వివ‌రాలు లేవు. ఈ నేప‌థ్యంలో తొంద‌ర‌గా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Career and Courses: బ్యాంకింగ్ రంగంలో ఆరు నెలల కొత్త‌ హైబ్రిడ్ కోర్సు.. అప్లికేష‌న్ విధానం

రిజిస్ట్రేష‌న్ విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://careers.wipro.com/opportunities/jobs/2617212?lang=en-us&previousLocale=en-US లింక్‌ను సంద‌ర్శించాలి.

Step 3 : అనంత‌రం Apply ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

Step 4 : కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.

Step 5 : ఈ మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకొని తప్పులు లేకుండా అప్లికేష‌న్ నింపాలి.

Step 6 : ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌లు పూర్తిగా చ‌దివి ద‌ర‌ఖాస్తుఫాంను నింపాలి.

Career and Courses: బ్యాంకింగ్ కెరీర్‌పై ఆస‌క్తి ఉందా.. అయితే ఈ ఉచిత కోర్సుల వివరాలు..

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో (Wipro) మహిళలకు (women) గుడ్​న్యూస్​ చెప్పింది. కెరీర్​ గ్యాప్ తీసుకున్న మహిళా ఐటీ నిపుణులు (Women IT Experts) తిరిగి తమ కెరీర్​ను చక్కబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వారి కోసం ‘బిగిన్ ఎగైన్’ (begin Again) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విప్రో ఇన్‌క్లూజన్ అండ్​ డైవర్సిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ (Wipro Inclusion and Diversity Initiative Program)​ కింద కెరీర్‌ గ్యాప్​ ఉన్న మహిళా నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కెరీర్​ విరామం పొందిన మహిళా నిపుణులు (Women Experts) మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు (Apply) చేసుకోవచ్చని తెలిపింది.

Govt jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌!

విప్రో ‘బిగిన్​ ఎగైన్​’ (Begin again) ప్రోగ్రామ్​పై చేసిన ట్వీట్​లో పలు విషయాలు పంచుకుంది. “బిగిన్ ఎగైన్ అనేది మహిళల కోసం మొదటిసారిగా ప్రత్యేకంగా మేము ప్రారంభించిన ఇంక్లూజన్ అండ్​ డైవర్సిటీ (I&D) ప్రోగ్రామ్​. కెరీర్​​ గ్యాప్​ తర్వాత తిరిగి వారి కెరీర్‌ను ప్రారంభించాలని చూస్తున్న మహిళల (women) కోసం దీన్ని ఆవిష్కరించాం. విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి లేదా మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల ఏర్పడిన కెరీర్​ గ్యాప్ (career gap)​కు పుల్​స్టాప్​​ పెట్టడానికి సదావకాశాన్నిస్తోంది. ఈ చొరవ ప్రతిభావంతులైన మహిళలకు కెరీర్​ అవకాశాలు మెరుగుపర్చేందుకు వీలు కల్పిస్తుంది. తిరిగి తమ కెరీర్​ను ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశం (Opportunity) కల్పిస్తుంది" అని పేర్కొంది.

First published:

Tags: Banking, JOBS, Wipro

ఉత్తమ కథలు