యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అసిస్టెంట్ డైరెక్టర్, అగ్రికల్చరల్ ఇంజనీర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. UPSC రిక్రూట్మెంట్ 2021 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు సెప్టెంబర్ 16 ఆఖరు తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 23
అసిస్టెంట్ డైరెక్టర్ - 2 పోస్టులు
వ్యవసాయ ఇంజనీర్ - 1 పోస్ట్
అసిస్టెంట్ జియాలజిస్ట్ - 20 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లాంట్ పాథాలజీ)
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు గుర్తింపు పొందని యూనివర్సిటీలో పాథాలజీలోగాని, వ్యవసాయంలోగాని ఎమ్మెసీ పూర్తి చేయాలి. లేదా బోటనీలో ఎమ్మెసీ చేయాలి.
అనుభవం: మూడు సంవత్సరాలు మొక్కల వైరస్, మొక్కల బ్యాక్టీరియాకు సంబంధించిన దేశీయ మరియు విదేశీ మొక్కల వ్యాధుల అధ్యయనంలో అనుభవం ఉండాలి.
జీతం: రూ.56,100 - 1,77,500
వ్యవసాయ ఇంజనీర్ (Instrumentation)
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో డిగ్రీ ఉండాలి.
అనుభవం: ఆటోమేటిక్ కొలత మరియు నియంత్రణల కొరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ పరికరాల పనిలో రెండేళ్ల అనుభవం. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ (లిస్టెడ్) సంస్థ నుంచి స్ట్రెయిన్ గేజ్, సౌండ్ మరియు వైబ్రేషన్ పరికరాలు మొదలైన వాటి నిర్వహణ అనుభవం కలిగి ఉండాలి.
జీతం: రూ. 44,900-1,42,400
అసిస్టెంట్ జియాలజిస్ట్..
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ లేదా జియో ఎక్స్‌ప్లోరేషన్ లేదా మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ లేదా ఇంజనీరింగ్ జియాలజీ లేదా జియో-కెమిస్ట్రీ లేదా మెరైన్ జియాలజీ లేదా ఎర్త్ సైన్స్ & రిసోర్స్ మేనేజ్మెంట్ లేదా ఓషనోగ్రఫీ మరియు కోస్టల్ ఏరియా స్టడీస్ (కోస్టల్ జియాలజీ) లేదా ఎన్విరాన్మెంటల్ జియాలజీ లేదా జియో-ఇన్ఫర్మేటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.
జీతం: రూ.47,600-1,51,100
Note: అర్హత ఉన్న అభ్యర్థుల విషయంలో UPSC అభీష్టానుసారం అర్హతలు సడలించబడతాయి.
అప్లె చేసే విధానం..
అర్హతలతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.upsconline.nic.in. వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి.
ఎంపిక విధానం..
దరఖాస్తు చేసుకొన్న షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థి వివరాలు వెబ్సైట్లో ఉంచుతారు. ఎంపికైన అభ్యర్థి అన్ని అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
దరఖాస్తుకు చివరి తేది. సెప్టెంబర్ 16, 2021
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021