JOBS IN TS CONTRACT JOBS IN DMHO OFFICE THREE DAYS CHANCE TO APPLY KNOW DETAILS EVK
Jobs in TS: డీఎంహెచ్ఓ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే చాన్స్
రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు
Jobs in Telangana | తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ ఆఫీసర్ తదితర విభాగంలో 13 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో (డీఎంహెచ్ఓ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ప్రొగ్రాం ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ ఆఫీసర్ తదితర విభాగంలో 13 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://khammam.telangana.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు మే 9, 2022 వరకు అవకాశం ఉంది.
Step 3 - అనంతరం నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.
Step 4 - నోటిఫికేషన్ చివరన దరఖాస్తు ఫాం ఉంటుంది.
Step 5 - దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫాంను తప్పులు లేకుండా నింాలి.
Step 6 - అప్లికేషన్‌ను నోటిఫికేషన్‌లో పేర్కొన్న అడ్రస్‌కు పంపాలి.
Step 7 - దరఖాస్తుకు మే 9, 2022 వరకు అవకాశం ఉంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లో 2,942 ఉద్యోగాలు
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పలు విభాగాల్లో 2,942 పోస్టల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదోతరగతి విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎటుంటి పరీక్ష లేకుండా కేవలం పదోతరగతి మార్కుల మెరిట్, సిస్టమ్ జనరేటెడట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. కేవలం రూ.100 మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://indiapostgdsonline.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 5, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.