Home /News /jobs /

JOBS IN TELANGANA VARIOUS POSTS IN NMDC HYDERABAD KNOW ELIGIBILITY AND APPLICATION PROCEDURE EVK

Jobs in Telangana: ఎన్ఎండీసీ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

ఎన్ఎండీసీలో ఉద్యోగాలు

ఎన్ఎండీసీలో ఉద్యోగాలు

Jobs in Telangana | భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకి చెందిన నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ సంస్థ ప్ర‌ధాన కేంద్రం హైద‌రాబాద్‌ (Hyderabad) లోనే ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 29 ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (Executive Trainee) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు

ఇంకా చదవండి ...
    భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకి చెందిన నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌ (National Mineral Development Corporation) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ సంస్థ ప్ర‌ధాన కేంద్రం హైద‌రాబాద్‌ (Hyderabad) లోనే ఉంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 29 ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ  (Executive Trainee)  పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియపూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. గేట్- 2021 (GATE-2021) స్కోర్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్ స‌మాచారం, ద‌ర‌ఖాస్తు సందేహాల కోసం అధికారికి వెబ్‌సైట్ https://jobapply.in/NMDC2022GATE/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 23, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Indian Army Jobs 2022: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు

    పోస్టుల వివ‌రాలు..























    ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ  విభాగంఖాళీలు
    ఎల‌క్ట్రిక‌ల్‌06
    మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌09
    మెకానిక‌ల్‌10
    మైనింగ్‌04

    అర్హ‌త‌లు..
    - గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
    - గేట్ -2021లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల గేట్‌-2021 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - షార్ట్ లిస్ట్ అభ్య‌ర్థుల‌కు గ్రూప్ డిస్క‌ష‌న్‌లు, ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.
    - మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    Jobs in Andhra Pradesh: ప్ర‌కాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ. 17,500, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://jobapply.in/NMDC2022GATE/ ను సంద‌ర్శించాలి.

    Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ. 80,000.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

    Step 3 - నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step4 - అనంత‌రం Fresh Candidate (CLICK HERE) to Create Log In లింక్‌లోకి వెళ్లాలి.

    Step 5 - అక్క‌డ పేరు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబ‌ర్‌తో రిజిస్ట్రేష‌న్ చేసుకొని అప్లికేష‌న్ ఫాం నింపాలి.

    Step 6 - ద‌ర‌ఖాస్తు పూర్తయిన త‌రువాత రూ. 500 ఫీజ‌లు చెల్లించాలి.

    Step 7 - ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంది.

    Step 8 - ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 23, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Hyderabad, Job notification, JOBS, Jobs in telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు