Home /News /jobs /

JOBS IN TELANGANA VAIDYA VIDHANA PARISHAD IN PEDDAPALLI MS KNR

Jobs In Telangana: పెద్దపల్లిలో కొలువుల జాతర... వైద్య విద్యార్థులకు పండుగే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs In Telangana: చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని అనుకుంటున్నా.. కొద్దికాలంగా అది వాయిదా పడుతూ వస్తున్నది. అయితే తాజాగా.. ఖాళీల వివరాలతో పాటు.. ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం గమనార్హం.

  • News18
  • Last Updated :
    తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ పెద్దపల్లి జిల్లాలో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్ భారతి హోళికెరి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని అనుకుంటున్నా.. కొద్దికాలంగా అది వాయిదా పడుతూ వస్తున్నది. అయితే తాజాగా.. ఖాళీల వివరాలతో పాటు.. ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం గమనార్హం. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    జిల్లా ఆస్పత్రి పెద్దపల్లిలో...

    గైనకాలజిస్ట్ - 1 ( పి.జి డిగ్రీ లేదా డిప్లొమా లేదా డి.ఎన్. బి )
    పిడియాట్రీషియన్ - 1 ( పి.జి డిగ్రీ లేదా డిప్లొమా లేదా డి. ఎన్. బి )
    సివిల్ అసిస్టెంట్ సర్జన్- 1 ( ఎం.బి.బి.ఎస్ )

    ప్రాంతీయ ఆస్పత్రి గోదావరిఖనిలో..
    గైనకాలజిస్ట్ - 1 ( గైనకాలజిలో పి.జి డిగ్రీ లేదా డిప్లొమా లేదా డి.ఎను.బి)
    పాథాలజిస్ట్ (బ్లడ్ బ్యాంకు)  - 1 ( పి.జి ఎం.డి పాథాలజీ డిగ్రీ లేదా ట్రాన్సుఫ్యూషన్ మెడిసిన్ లేదా డి.ఎన్.బి లేదా ఎం.బి.బి.ఎస్డి తో డిప్లొమా పాథాలజీ)

    సామజిక ఆస్పత్రి మంథనిలో..
    గైనకాలజిస్ట్ - 3 ( గైనకాలజిలో పి.జి డిగ్రీ లేదా డిప్లొమా లేదా డి.ఎన్..బి)
    అనస్తీషియా   - 2  ( అనస్తీషియా పి.జి డిగ్రీ లేదా డిప్లొమా లేదా డి.ఎన్ .బి)
    సివిల్ అసిస్టెంట్ సర్జన్- 1 ( ఎం.బి.బి.ఎస్ )

    ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23 నుండి 31 లోగా(అన్ని పని దినాలలో) పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను మెడికల్ సూపరింటెండెంట్ గారి కార్యాలయం, జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి లో సమర్పించాలి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ గారి కార్యాలయం నోటీసు బోర్డు వద్ద ఉంచారు. నిర్ణీత దరఖాస్తు ఫారములు కూడా మెడికల్ సూపరింటెండెంట్ గారి కార్యాలయం లో లభిస్తాయని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Doctors, JOBS, Medical services, Peddapalli, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు