Home /News /jobs /

JOBS IN TELANGANA TEACHER JOBS IN TELANGANA QUALIFICATIONS APPLICATION PROCESS EVK

Jobs in Telangana: తెలంగాణ‌లో టీచ‌ర్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Army Public School | భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో అప్లికేష‌న్ విధానం తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు (Defence Ministry) చెందిన ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లోని (Army Public School) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 41 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో పోస్టు ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 25, 2022ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా పంపించాల్సి ఉంటుంది.

    Inter Exams 2022: నేటి నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..

    ఖాళీలు..
























    పోస్టుఖాళీలు
    పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT)15
    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT20
    ప్రైమరీ టీచర్స్ PRT06
    మొత్తం41

    విద్యార్హతల వివరాలు..
    పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT): సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కెఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైకాలజీ లో ఖాళీలు ఉన్నాయి.

    TSPSC Group-1: గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పోస్టుల కేటాయింపుపై సందేహాలా.. ఈ విష‌యాలు తెలుసుకోండి

    ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGT: హిందీ, సంస్కృతం, సోష‌ల్ సైన్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇంగ్లీష్‌, ఫిజిక్స్ లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    పీఆర్టీ: ప్రైమరీ క్లాసెస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడానికి 25 మంది టీచర్ల ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ/డీ.ఈ.ఈడీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయాల్సి ఉంటుంది.

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం హోం పేజీలో vacancies లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3:  కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఉంటాయి. ఆ వివరాలను పూర్తిగా చదివిన అనంతరం APPLICATION FORM ఆప్షన్ పై క్లిక్ చేయాలి.



    Step 4: అనంతరం మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో సూచించిన వివరాలను పూర్తిగా నింపాలి.

    TSPSC Group-1: గ‌్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారంతా ఎన్ఓసీ స‌బ్‌మిట్ చేయాల్సిందే.. టీఎస్‌పీఎస్‌సీ

    Step 5: ఆ ఫామ్ ను  ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్ పోస్ట్, సికింద్రాబాద్ - 500087 చిరునామాకు మే 25, 2022 లోగా పంపించాల్సి ఉంటుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Job, Job notification, JOBS, Jobs in telangana, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు