Jobs: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. త్వరలోనే 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ..

తెలంగాణ యువతకు హోంమంత్రి మహమూద్ అలీ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసు శాఖలో మరో భారీ నియామక ప్రక్రియ చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు. పోలీసు శాఖకు నిధుల సమస్య లేదని అలీ చెప్పారు.

news18
Updated: October 23, 2020, 1:46 PM IST
Jobs: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. త్వరలోనే 20 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 23, 2020, 1:46 PM IST
  • Share this:
తెలంగాణ లో పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువతకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తెలంగాణలో 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. మునుపెన్నడూ లేని విధంగా.. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటికే 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామనీ, అంతేగాక తమ ప్రభుత్వ హయాంలో 18,428 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని అలీ చెప్పారు. ఇదేవిధంగా కొత్తగా చేపట్టబోయే పోలీసు నియామకాల గురించి కూడా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 1162 మంది ఎస్సైల ‘పాసింగ్ అవుట్ పరేడ్’ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రోజు రోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు విధులను నిర్వర్తించాలని ఆయన తెలిపారు. తెలంగాణ లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని అలీ చెప్పారు. పోలీసు శాఖకు నిధుల కొరత లేదనీ, ఆధునిక పరికరాల కొనుగోలు, సాంకేతికతను ప్రాదాన్యతనిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలోనే గాక ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పోలీసులు వారికి సాయం చేయడంలో ఎంతో కృషి చేశారని వారి సేవలను కొనియాడారు.

telangana police, telangana, dgp mahender redyy, telangana cm, cm kcr, jobs, jobs in police department, jobs in telangana,home minister mahamood ali, ts home minister
మహమూద్ అలీ (ఫైల్ ఫోటో)


కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరబోతున్న పోలీసులు.. ప్రజలకు సేవ చేస్తూ.. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసుల పాత్ర మరువలేనిదనీ, పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవమిస్తూ.. వారి సమస్యలను సావధానంగా వినాలని వారిక సూచించారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో శిక్షణ పొందిన యువ ఎస్.ఐ లు ప్రభుత్వ సేవలోకి ప్రవేశించడం గర్వకారణమని అన్నారు నీతి,నిజాయితీ, నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖకు తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ మేరకు నేర రహిత సమాజాన్ని కల్పించాలని అన్నారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సమాజంలో మార్పు పోలీసులతోనే సాధ్యమని, ప్రభుత్వ పథకాల అమలులో పోలీస్ శాఖ భాగస్వామ్యం కావాలని మహేందర్ రెడ్డి అన్నారు.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading