తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పని చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లో కలిపి 12 పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 వేతనం అందిస్తారు. ఎటువంటి పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://chfw.telangana.gov.in/home.do ను సందర్శించాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ మే 20,2022. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇంటర్వ్యూకి హాజరు అవ్వండి.
పోస్టుల వివరాలు..
పోస్టు
అర్హతలు
ఖాళీలు
వేతనం
డిస్ట్రిక్ట్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజనర్
పోస్టులకు సంబంధించి సంబంధిత పనిలో అనుభవం, విద్యార్హత ఉండాలి.
12
రూ. 40,000
ముఖ్యమైన అంశాలు..
- ఈ పోస్టులకు ఎటువంటి దరఖాస్తులు అవసరం లేదు.
- నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు అవ్వాలి.
- ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీడబ్ల్యూడీ, అభ్యర్థుకు రూ. 250 దరఖాస్తు రుసుం ఇవ్వాలి. ఇతర అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
- ఇంటర్వ్యూకి హాజరు అవ్వాల్సిన వెనూ : the Commissioner of Health & Family Welfare and Mission Director, National Health Mission, T.S., Hyderabad.
- ఇంటర్వ్యూ తేదీ మే 20, 2022
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.