హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Telangana: మ‌హ‌బూబాబాద్‌లో ఉద్యోగాలు.. నెల‌కు వేత‌నం రూ. 26,250.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ!

Jobs in Telangana: మ‌హ‌బూబాబాద్‌లో ఉద్యోగాలు.. నెల‌కు వేత‌నం రూ. 26,250.. ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ!

మహబూబాబాద్లో ఉద్యోగాలు

మహబూబాబాద్లో ఉద్యోగాలు

Jobs in Telangana | తెలంగాణ‌లో భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన తెలంగాణ‌లోని కేంద్రీయ విద్యాల‌యం ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. కేంద్రీయ విద్యాల‌యం-మ‌హ‌బూబాబాద్‌ ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం వాక్ ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంకా చదవండి ...

తెలంగాణ‌ (Telangana) లో భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ శాఖకి చెందిన తెలంగాణ‌లోని కేంద్రీయ విద్యాల‌యం ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. కేంద్రీయ విద్యాల‌యం-మ‌హ‌బూబాబాద్‌ ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం వాక్ ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రైమ‌రీ టీచ‌ర్‌, టీజీటీ, స్పోర్ట్స్ కోచ్‌, కంప్యూట‌ర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ (Computer Instructor), న‌ర్స్ అండ్ స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌రఖాస్తు చేస్తున్న అభ్య‌ర్థుల వ‌య‌సు 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ఎంపిక విధానానికి సంబంధించి స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://mahabubabad.kvs.ac.in/ ను సంద‌ర్శించాలి. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు మార్చ్ 8, 9 తేదీల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు.

Jobs in Telangana: సిద్దిపేట, సిరిసిల్లలో ఉద్యోగ అవ‌కాశాలు.. ప‌రీక్ష లేకుండా వాక్ ఇన్‌.. అర్హ‌త‌లు ఇవే!

పోస్టుల వివ‌రాలు..

పోస్టు పేరుఅర్హతలువేతనం
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్సంబంధిత స‌బ్జెక్టులో బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ చేసి ఉండాలి. . సీటెట్ ఉత్తీర్ణ‌త సాధించాలి.రూ. 26,250
ప్రైమరీ టీచర్స‌బంధిత సంబ్జెక్టుల్లో 50శాతం మార్కులు, డిప్ల‌మా, బీఈడీ చేసి ఉండాలి.రూ. 21,250
స్పోర్ట్స్ కోచ్స‌బంధిత సంబ్జెక్టుల్లో డిప్ల‌మా, డిగ్రీ, చేసి ఉండాలి. ఇంగ్లీష్ ప‌రిజ్ఞానం ఉండాలి.రూ. 21,250
కంప్యూటర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్బీఈ, బీటెక్ చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాష‌లో ప్రావీణ్య‌త ఉండాలి.రూ. 26,250
స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్‌బీఏ, బీఎస్సీలో సైకాల‌జీ చేసి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.రూ. 26,250
న‌ర్స్‌బీఎస్సీ, డిప్ల‌మాలో న‌ర్సింగ్ చేసి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.రూ.750 రోజుకు
డేటా ఎంట్రీ  ఆపరేటర్ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. టైపింగ్ ప‌రిజ్ఞానం ఉండాలి.రూ.15,000
పీఆర్‌టీ మ్యూజిక్‌50%తో సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు బ్యాచిలర్ స‌ర్టిఫికెట్ ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.రూ. 21,250


Jobs in Andhra Pradesh: శ్రీ‌కాకుళం జిల్లాలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండా ఎంపిక‌, అర్హ‌త‌లు ఇవే!

ఇంట‌ర్వ్యూ తేదీలు..

పోస్టు పేరుఇంట‌ర్వ్యూ
ప్రైమ‌రీ టీచ‌ర్ (పీఆర్‌టీ)మార్చ్ 8, 2022
టీజీటీ(ఇంగ్లీష్‌, హిందీ, సంస్కృతం, మ్యాథ‌మెటిక్స్‌, సైన్స్‌, సోష‌ల్ సైన్స్‌, స్పోర్ట్స్ కోచ్‌)మార్చ్ 8, 2022
కంప్యూట‌ర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, న‌ర్స్ అండ్ స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్ (కౌన్సిల‌ర్‌)మార్చ్ 9, 2022
పీఆర్‌టీ మ్యూజిక్‌మార్చ్ 9, 2022


Govt jobs 2022: హెచ్‌బీసీఎస్ఈలో ఉద్యోగాలు.. వేత‌నం రూ.48,500.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ!

ఎంపిక విధానం..

- అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు ధ్రువప‌త్రాల‌తో ఇంట‌ర్వ్యూకి హాజ‌రు కావాలి.

- ఇంట‌ర్వ్యూ మెరిట్, అకాడ‌మిక్ మెరిట్‌ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఇంట‌ర్వ్యూ ప్రాంతం..

Venue: Kendriya Vidyalaya Mahabubabad.

First published:

Tags: Govt Jobs 2022, Job notification, JOBS, Jobs in telangana

ఉత్తమ కథలు