హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Telangana: సింగ‌రేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. మూడు రోజులు ఇంట‌ర్వ్యూలు

Jobs in Telangana: సింగ‌రేణిలో ఉద్యోగాలు.. ప‌రీక్ష లేదు.. మూడు రోజులు ఇంట‌ర్వ్యూలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

The Singareni Collieries Company | భార‌త ప్ర‌భుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిస్తున్న ప్ర‌భుత్వ సంస్థ సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్త‌గూడంలో ఉంది. ప‌లుపోస్టుల భ‌ర్తీకి ఎటువంటి ప‌రీక్ష లేకుండా సంస్థ ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తోంది. ఈ ఇంట‌ర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తున్నారు.

ఇంకా చదవండి ...

భార‌త ప్ర‌భుత్వం, తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిస్తున్న ప్ర‌భుత్వ సంస్థ సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్త‌గూడంలో ఉంది. ఇందులో పలు పోస్టుల భ‌ర్తీకి  దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విడుదలైన  నోటిఫికేష‌న్ (Notification) ద్వారా వివిధ పోస్టుల‌ను ప‌రీక్ష లేకుండా నేరుగా ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేయ‌నున్నారు. ఇంట‌ర్వ్యూకు హాజ‌రయ్యే అర్హులైన అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 45 ఏళ్లు మించి ఉండ‌కూడదు. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూల స‌మాచారం, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికార‌కి వెబ్‌సైట్ https://scclmines.com/012022/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తారు.

Jio Institute: కొత్త కోర్సులను లాంచ్ చేసిన జియో ఇన్‌స్టిట్యూట్.. పీజీ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

పోస్టుల వివరాలు..

పోస్టు పేరుఖాళీలు
జనరల్ సర్జన్05
ఆర్థో స‌ర్జ‌న్05
ఈఎన్‌టీ స‌ర్జ‌న్‌02
ఆప్త‌మాల‌జిస్ట్‌03
గైన‌కాల‌జిస్ట్‌07
ఫిజిషియ‌న్‌04
రేడియాల‌జిస్ట్‌02
పాథాల‌జిస్ట్‌01
హెల్త్ ఆఫీస‌ర్‌04
అనెస్థిటిస్ట్‌06
పీడియాట్రిషియ‌న్‌03
సైకియాట్రిస్ట్‌01
చెస్ట్ ఫిజిషియ‌న్‌02


అర్హతలు..

ఈ పోస్టులకు సంబంధించిన విభాగాల్లో  పి.జి. లో డిగ్రీ/DNB చేసి ఉండాలి. అంతే కాకుండా స్పెషలైజేషన్ కూడా చేసి ఉండాలి.

ఎంపిక విధానం..

- అర్హ‌తలు ఉన్న వారు నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రు అవ్వాలి.

- మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

UGC: ఉన్నత విద్యపై యూజీసీ కీలక నిర్ణయం.. విద్యార్థుల‌కు మ‌రింత సౌల‌భ్యం

 ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://scclmines.com/012022/ ను సంద‌ర్శించాలి.

 Step 3 - అప్లై ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు ఫాంను నింపాలి.


TSPSC OTR: నిరుద్యోగుల‌కు బిగ్ రిలీఫ్‌.. టీఎస్‌పీఎస్సీ కీల‌క నిర్ణ‌యం

Step 4 - త‌ప్పులు లేకుండా ద‌ర‌ఖాస్తు ఫాం నింపాలి.

Step 5 - అనంత‌రం ఇంట‌ర్వ్యూ తేదీల్లో హాజ‌రు అవ్వాలి.

Step 6 - ఇంట‌ర్వ్యూ తేదీలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వ‌హిస్తారు.

First published:

Tags: Govt Jobs 2022, Singareni Collieries Company, Telangana

ఉత్తమ కథలు